• search

ఆసక్తికరం: రేవంత్ రెడ్డికి.. సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్! ఇది ‘కేసీఆర్ మార్కు’ రాజకీయమా?

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: 'రాజకీయాల్లో శశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు' అని అంటూ ఉంటారు. ఇది నిజమేనని అనిపించక మానదు ఇలాంటి ఘటనలు చూసినప్పుడు. లేదంటే.. 'ఇది కేసీఆర్ మార్కు రాజకీయం' అనుకోవాలేమో!

   Revanth Reddy resignation High drama : "రాజీనామా" చెయ్యలేదంటగా ? | Oneindia Telugu

   రాజకీయాలంటేనే అనూహ్యతకు, ఆశ్చర్యాలకు నెలవు. సీఎం కేసీఆర్‌ రాజకీయాల్లో ఇవి మరీ ఎక్కువ. టీడీపీ మాజీ నేత, ప్రస్తుత కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి పేరు చెబితేనే అగ్గిమీద గుగ్గిలమయ్యే కేసీఆర్‌... రేవంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

   బుధవారం రేవంత్‌ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు పుష్పగుచ్ఛం, రెండు వాక్యాల అభినందన లేఖ పంపారు. 'దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. మీరు ప్రజాసేవలో మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలి..' అని కేసీఆర్‌ రేవంత్‌కు పంపిన లేఖలో ఆకాంక్షించారు.

   KCR sent Birthday Wishes to Revanth Reddy

   టీడీపీలో ఉన్నప్పుడుగానీ, అంతకుముందుగానీ రేవంత్‌కు కేసీఆర్‌ ఇలా విషెస్‌ చెప్పిన దాఖలాలు లేవనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఓటుకు నోటు కేసు తర్వాత అయితే.. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలకు, రేవంత్‌కు మధ్యన వాతావరణం ఉప్పు నిప్పులా మారింది.

   అవకాశం దొరికినప్పుడల్లా అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు రేంవంత్ రెడ్డి పరస్పరం దుమ్మెత్తిపోసుకునేవారు. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సమయంలో కూడా 'ఇక ఆట మొదలైంది..' అని రేవంతర్ పరోక్షంగా టీఆర్ఎస్‌ను హెచ్చరించారు కూడా.

   అయితే అవేవీ మనసులో పెట్టుకోకుండా, ఉన్నట్లుండి కేసీఆర్ రేవంత్ జన్మదినం సందర్భంగా పుష్పగుచ్ఛం, అభినందన లేఖ పంపించడం, అది కూడా రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆసక్తికర పరిణామమే!

   అయితే దీనిని పలువురు పలురకాలుగా విశ్లేషిస్తున్నారు. సాధారణంగానే ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు తెలియజేయటం కేసీఆర్ కు అలవాటని కొందరు అంటుంటే, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి‌లాంటి వాళ్లను సైతం దువ్వి మచ్చిక చేసుకున్న కేసీఆర్ తన రాజకీయ వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డికి కూడా బిస్కెట్ వేశారని వ్యాఖ్యానిస్తున్నారు.

   English summary
   A surprise is this.. Telangana CM KCR sent birthday wishes to Former TDP leader, present Congress leader Revanth Reddy on his birthday which is on 8th November. Revanth received a flower bouquet and a short message in writing from CM KCR. In that message CM KCR wished that Revanth Reddy should continue in People's service further with good health.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more