సీఎం శివరాత్రి శుభాకాంక్షలు, కేసీఆర్‌ను చూడాలని ఓ బాలుడి ఆకాంక్ష

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు.

మహాశివరాత్రి సందర్భంగా రద్దీ దృష్ట్యా శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

KCR Shivaratri greeting to Telangana people

మరోవైపు, శివరాత్రిని పురస్కరించుకుని పర్యాటకశాఖ భక్తులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. నాలుగు ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులతో పాటు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

కేసీఆర్‌ను చూడాలని బాలుడి ఆకాంక్ష

వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన విఘ్నేష్ మూడేళ్లుగా జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతను ఇంట్లోనే ఉంటూ టీవీకే పరిమితమయ్యాడు. కేసీఆర్ పైన అభిమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకు కేసీఆర్‌ను చూడాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Chief Minister KCR Shivaratri greeting to Telangana people.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి