‘కేసీఆర్‌ను మరోసారి సీఎంగా చూడాలి- జాతీయ స్థాయిలో తెలంగాణే కింగ్ మేకర్’

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా మరోసారి కేసీఆర్‌ను చూడాలని ఆయన అన్నారు.

తెలంగాణలో అధికారం మాదేనంటూ కాంగ్రెస్‌ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్, ఎంఐఎంలు హవా కొనసాగిస్తాయని చెప్పారు.

తెలంగాణే కింగ్ మేకర్

తెలంగాణే కింగ్ మేకర్

కేసీఆర్‌ ప్రకటించిన మూడో కూటమి నిర్ణయంతో ఈ దఫా జాతీయ రాజకీయాల్లో తెలంగాణ కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించడం ఖాయమని మంగళవారం జరిగిన శాసనసభలో అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభలో మంగళవారం చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ప్రవేశపెట్టారు. అనంతరం అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడారు.

కేసీఆర్ మరోసారి

కేసీఆర్ మరోసారి

కాంగ్రెస్‌ 70 ఏళ్లపాటు ప్రజలను మోసం చేసిందని అక్బరుద్దీన్ అన్నారు. కేసీఆర్‌ను 2019లోనూ ముఖ్యమంత్రిగా చూడాలని ఉందన్నారు. కేసీఆర్‌ ప్రజలకు కాస్త సమయం కేటాయించాలని, వారికి దగ్గరవ్వాలని సూచించారు.
పలు సమస్యలపైనా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

చీకటి రోజు.. కాంగ్రెస్ అసహనంలో

చీకటి రోజు.. కాంగ్రెస్ అసహనంలో

సభలో గవర్నర్‌, మండలి ఛైర్మన్‌లపై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపించాలని సభాపతిని అక్బరుద్దీన్ కోరారు. సోమవారం సభ చరిత్రలో బ్లాక్‌డేగా మిగిలిపోతుందన్నారు. కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలను సమర్థిస్తున్నట్టు చెప్పారు. ఘటన తాలూకూ దృశ్యాలను మీడియా ముందు ప్రదర్శించాలని కోరారు.
దేశంలో ఎక్కడా విజయాలు లభించకపోవడంతో కాంగ్రెస్‌లో అసహనం పెరిగిపోతోందన్నారు. ‘ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేని పక్షంలో సభ నుంచి వాకౌట్‌ చేయొచ్చు. ప్రజల మధ్యకు వెళ్లే అవకాశమూ ఉంది. అందుకు భిన్నంగా కాంగ్రెస్‌ సభ్యుల ప్రవర్తన సరికాదు' అని అన్నారు.

మెట్రో రైలు నేనే అడిగా

మెట్రో రైలు నేనే అడిగా


నగదు కొరత రాష్ట్రంలో తీవ్రంగా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. హైదరాబాద్‌కు మోనో రైలు కావాలని దివంగత నేత జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేయగా.. మెట్రో రైలు కావాలని తాను అడిగానన్నారు. అయినా పాతబస్తీకి మెట్రో రైలు రాలేదని చెప్పారు. ‘తాము మార్గం మార్చాలని అడిగితే కుదరదన్నారు. మరి పాతమార్గంలోనైనా మెట్రో వస్తుందా?' అని ప్రశ్నించారు. ఒకవైపు ఉర్దూను రెండో అధికార భాషగా మార్చిన ప్రభుత్వం మరోవైపు ఉన్న గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడమేంటని నిలదీశారు. ప్రవేశ పరీక్షల మాదిరిగానే ఉద్యోగ పరీక్షలను కూడా ఉర్దూలో నిర్వహించాలన్నారు.

కేసీఆర్‌పై కొప్పుల ప్రశంసలు

కేసీఆర్‌పై కొప్పుల ప్రశంసలు

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టిన చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ..గవర్నర్‌ ప్రసంగం సీఎం పనితీరుకు, రాష్ట్ర అభివృద్ధికి అద్దం పట్టిందన్నారు. వృద్ధి రేటు, తలసరి ఆదాయంలో రాష్ట్రం జాతీయ సగటు కంటే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. ఇదే సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలని ఉందని, స్పీకర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్తే బాగుంటుందని ఆయన కోరారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలతో.. ఎప్పటికీ తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. ఒకప్పుడు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులకు నిలయమైన ఈ ప్రాంతంలో ఇప్పుడు నకిలీ విత్తనం కన్పించడం లేదన్నారు. అక్రమార్కులపై పీడీ చట్టం ప్రయోగించడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MIM MLA Akbaruddin Iwaisi on Tuesday said that TRS president K Chandrasekhar Rao should again Telangana CM.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి