హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తనయుడ్ని పురమాయిస్తూ కీలెరిగి వాత పెడుతున్న కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆత్మరక్షణలో పడ్డారని అందరూ భావిస్తున్న సమయంలో ఒక్కసారిగా మీడియా ముందుకో, ప్రజల ముందుకో వచ్చి ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.

తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మొదట్లో హైదరాబాదులోని అక్రమ కట్టడాలపై దృష్టి సారించారు. అయితే, కొద్ది రోజులు అక్రమ కట్టడాల కూల్చివేత జరిగే సరికి ప్రతిపక్షాల నాయకులు, స్థానిక నాయకులు, బాధితులు గగ్గోలు పెట్టారు. దాంతో అక్రమ కట్టడాల కూల్చివేత ఆగిపోయింది. దీంతో కెసిఆర్ దాన్ని పక్కన పెట్టేశారని అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా ఇప్పుడు తిరుగులేని వాదనతో ముందుకు వచ్చారు. భారీ వర్షాలతో హైదరాబాదు రోడ్లు, కాలనీలు ముంపునకు గురయ్యాయి. సహాయక, పునరావాస చర్యల విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిందులు వేయడానికి సిద్ధపడుతున్న సమయంలో ఆయన మీడియా ముందుకు వచ్చి విరుచుకుపడ్డారు. వరదలకు అక్రమ కట్టడాలను కారణంగా చూపి వాటి అంతు తేల్చేందుకు సిద్ధపడ్డారు.

ఇదిలావుంటే, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో తమ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు ఘన విజయం సాధించి పెట్టిన తనయుడికి మున్సిపల్ శాఖను అప్పగించారు. ఇప్పుడు తన తనయుడిని పురమాయిస్తూ అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నారు. తెరాస నాయకులు అడ్డుపడినా వదిలిపెట్టడం లేదు.

 ఎట్టి స్థితిలోనూ వదలొద్దని కెసిఆర్ ఆదేశాలు

ఎట్టి స్థితిలోనూ వదలొద్దని కెసిఆర్ ఆదేశాలు

చెరువులు, నాలాలు కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఏ మాత్రం వదిలేయవద్దని, వాటిని కూల్చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో ఆయన ఫోనలో మాట్లాడి ఆ విషయం చెప్పారు. భారీ వర్షాలు, అనంతరం పట్టణాల్లోని పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌ మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.

 సమీక్ష చేస్తూ రెండు సార్లు ఫోన్...

సమీక్ష చేస్తూ రెండు సార్లు ఫోన్...

పట్టణాల్లోని పరిస్థితిపై సమీక్ష చేస్తూనే కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్‌కు రెండు సార్లు ఫోన్ చేశారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాల్సిందేనని, ఎవరినీ వదిలి పెట్టవద్దని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆదేశించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

 ఆ పరిధిలోనూ కూల్చేయాల్సిందే..

ఆ పరిధిలోనూ కూల్చేయాల్సిందే..

హెచ్ఎండీఏ పరిధిలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని కెసిఆర్ సంబంధిత కమిషనర్‌ చిరంజీవులుకు ఫోన్‌లో చెప్పారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లోనూ అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రి, అధికారులతో సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూల్చివేతల పురోగతిపై ఆరా తీసినట్లు తెలిసింది.

 తెరాస కార్పోరేటర్లపై కెటిఆర్ ఆగ్రహం

తెరాస కార్పోరేటర్లపై కెటిఆర్ ఆగ్రహం


కూల్చివేతలను మన వాళ్లే అడ్డుకుంటే ముందుకు ఎలా సాగుతామని, కార్పొరేటర్లే ఇలా చేయడం సరైంది కాదని, ఇలాంటివి మళ్లీ జరగకూడదని కెటీఆర్ కార్పోరేటర్లకు తేల్చి చెప్పారు. సోమవారం నాడు అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న మూసాపేట కార్పొరేటర్‌ తూము శ్రవణ్‌ కుమార్‌పై
ఆయన సీరియస్‌ అయినట్టు చెబుతున్నారు.

 నాలాలకు ఇరువైపులా కట్టడాలను

నాలాలకు ఇరువైపులా కట్టడాలను

భవిష్యత్తులో వానలు పడితే హైదరాబాద్ నగరాన్ని నీటి నుంచి రక్షించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు నాలాలకిరువైపులా వెలసిన ఆక్రమణలు తొలగించేందుకు నడుం భిగించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటంతో పాటు కూల్చివేతలు చేపట్టేందుకు నియమించిన బృందాలు సోమవారం యుద్దాన్ని ప్రకటించారు. పోలీసులను సమన్వయం చేసుకుని, వారి బందోబస్తుతో మరీ జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు.

 కూల్చివేతలపై ఇలా సానుకూలం..

కూల్చివేతలపై ఇలా సానుకూలం..

ఆక్రమణలపై సర్కారు సీరియస్‌గా ఉండటంతో పాటు ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా అక్రమ కట్టడాల తొలగింపునకు సంబంధించి తీర్పులివ్వటంతో కూల్చివేతలకు ఎక్కడా కూడా వ్యతిరేకతలు ఏర్పడలేదు. కూల్చివేతల్లో భాగంగా సర్కిల్ 12లోని మదీనాగూడ రామకృష్ణానగర్‌లో నాలాపై ఎన్‌ఎస్‌కె బ్లిస్ మిడోస్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు సోమవారం కూల్చివేశారు. కాప్రా సర్కిల్‌లోని నల్లచెరువు నాలాపై మహాలక్ష్మీ ఎల్‌పిజి గ్యాస్ నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూడా కూల్చేశారు.

 ఉప్పల్ ప్రాంతంలోనూ కూల్చివేతలు...

ఉప్పల్ ప్రాంతంలోనూ కూల్చివేతలు...

ఉప్పల్ సర్కిల్ పరిధిలోని స్వరూప్‌నగర్‌లోని నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కుత్బుల్లాపూర్‌లోని ఫాక్స్ సాగర్ చెరువు శిఖం భూమిలో అక్రమంగా నిర్మించని ప్రహరీగోడలను తొలగించారు. సర్కిల్ ఎనిమిదిలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతాగేటు వద్దనున్న నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను పోలీసు బందోబస్తుతో అధికారులు తొలగించారు. హస్తినాపురం దేవకమ్మతోట సమీపంలోని నాలాపై ఆక్రణలను అధికారులు తొలగించారు. బంజారాహిల్స్‌లోని నాలాపై ఓ ఫంక్షన్ హాల్ నిర్మించిన అక్రమ నిర్మాణాలను సైతం అధికారులు కూల్చివేశారు.

 అక్రమ కబ్డాలు 39 కూల్చివేత

అక్రమ కబ్డాలు 39 కూల్చివేత

జిహెచ్‌ఎంసి అధికారులు నగరంలోని 24 సర్కిళ్లలో 39 ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను సోమవారంనాడు ఒక్కరోజే కూల్చివేశారు. ఇందులో భాగంగా నాలాలకిరువైపులా వెలసిన నిర్మాణాలు 8, చెరువుల్లో వెలసిన అక్రమ నిర్మాణాలు 3, శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలు 13, నిర్మాణ అనుమతులను ఉల్లంఘించి అదనంగా చేపట్టిన మరో 15 నిర్మాణాలతో కలిపి మొత్తం 39 కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.

పల్లె చెరువు నుంచి బండ్లగూడకు వెళ్లే నాలాపై..

పల్లె చెరువు నుంచి బండ్లగూడకు వెళ్లే నాలాపై..


పల్లె చెరువు నుంచి బండ్లగూడకు వెళ్లే 40 అడుగుల విస్తీర్ణంలోని నాలాపై అక్రమంగా నిర్మించిన రెండు ఇళ్లను జిహెచ్ఎంసి సిబ్పంది కూల్చివేసారు. బండ్లగూడలో నిర్మాణంలో ఉన్న కల్వర్ట్ పనులను పరిశీలించారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల పనులను కూడా కమిషనర్ జనార్దన్ రెడ్డ్ి పరిశీలించారు.

 ఆక్రమణలకు కారణం ఇదే..

ఆక్రమణలకు కారణం ఇదే..

ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే హైదరాబాదులో ఆక్రమణల జోరు పెరుగుతూ వచ్చింది. పదహారేళ్ల క్రితం 2800 పై చిలుకు ఉన్న ఆక్రమణలు ఇప్పుడు 28వేలకు పెరిగాయి. అప్పట్లోనే నాలాలపై ఆక్రమణలను తొలగించి, వాటిని వెడల్పు చేయాల్సిన అవసరముందని కిర్లోస్కర్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే అధికారంలో ఉన్న పార్టీలేవీ చర్యలు తీసుకోలేదు. ప్రజల నుంచి, స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంతో దానివల్ల పార్టీ అవకాశాలు దెబ్బ తింటాయని ప్రభుత్వాలు వాటి జోలికి వెళ్లలేదు.

 ఆక్రమణల గురించి విమర్శలు చేస్తూనే..

ఆక్రమణల గురించి విమర్శలు చేస్తూనే..

శాసనసభ్యులు, కార్పోరేటర్లు, పార్లమెంటు సభ్యులు, మొత్తంగా ప్రజాప్రతినిధులు నాలాల ఆక్రమణలను తొలగించటం లేదంటూ అధికారులపై మండిపడుతూనే, వాటిని తొలగించేందుకు వచ్చే అధికారులను క్షేత్ర స్థాయిలో అడ్డుంటూ ప్రజల్లో తమ ఉనికికి కాపాడుకుంటూ వస్తున్నారు. దాంతో ఆక్రమణల తొలగింపు సాధ్యం కాలేదు. ఇప్పుడు దానికి కెసిఆర్ విరుగుడు కనిపెట్టారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao adapted strategy to demilish illegal construction in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X