కేసీఆర్ గొప్ప మనసు.. రోడ్డుపై ఆ వృద్దుడిని చూసి కారు ఆపి..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. టోలీచౌకీలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో రోడ్డుపై ఓ వికలాంగ వృద్దుడిని చూసి కారు ఆపారు. చేతిలో దరఖాస్తు పట్టుకుని నిలబడటంతో.. డ్రైవర్‌ను కారు ఆపమన్నారు.
Recommended Video

ఆపై కారు నుంచి దిగి.. దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా మాట్లాడారు. తన పేరు సలీమ్ అని చెప్పిన ఆ వృద్దుడు.. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పాడు. గతంలో డ్రైవర్‌గా పనిచేసినట్టు తెలిపాడు.

సలీం నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ఆయన సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో టోలిచౌకీలోని సలీమ్ ఇంటికి వెళ్లిన కలెక్టర్ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జియాగూడ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. సలీమ్‌కు సదరం సర్టిఫికెట్ ఉండటంతో వికలాంగుల పెన్షన్ కూడా మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సలీమ్‌కు అవసరమైన వైద్య పరీక్షలు,చికిత్స ప్రభుత్వం తరుపున అందిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో డ్రైవర్ గా పనిచేసి, తొమ్మిదేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహ్మద్ సలీమ్ అనే వికలాంగుడు, వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, అక్కడికక్కడే సమస్యను పరిష్కరించారు. pic.twitter.com/xwA7Aw6SlX
— Telangana CMO (@TelanganaCMO) February 27, 2020












Click it and Unblock the Notifications