విచారణకు కేసీఆర్ హాజరు వేళ కీలక పరిణామాలు - చంద్రబాబు తరువాత..!!
తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కు హాజరయ్యేందుకు బయల్దేరారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హాజరవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవిత సైతం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి ఆరోపణల వేళ కమిషన్ విచారణ చేస్తోంది. ఈటల రాజేందర్.. హరీష్ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. కాగా, కేసీఆర్ హాజరు వేళ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విచారణ జరిగే కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
కేసీఆర్ - చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం విచారణ కోసం కమిషన్ ఎదుట హాజరవుతున్నారు. కాగా,
రెండు దశాబ్దాల్లో తెలుగు రాష్ట్రాల్లో కమిషన్ల విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలవనున్నారు. గతంలో ఏలేరు భూకుంభకోణంపై విచారణకు మాజీ సీఎం చంద్రబాబు హాజర య్యారు. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకి చేరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై విచారణ చేస్తున్న కమిషన్ ఇప్పటికే పలువురిని విచారణ చేసింది.కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జన రల్- కాగ్ నివేదిక సహా విజిలెన్స్ విభాగం, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను కమిషన్ పరిశీలించింది.

బీఆర్ఎస్ నిరసన
కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రులు ఈటల, హరీష్ హాజరయ్యారు. కమిషన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈ నెల 5నే కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రీత్యా మరో తేదీ అడగడంతో విచారణ నేటికి వాయిదా వేశారు. ఇప్పటి వరకు కమిషన్ 114 మందిని విచారణ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద రెండుసార్లు పనిచేసిన హరీశ్‌రావు నీటిపారుదలశాఖతో పాటు కొన్నాళ్లు ఆర్ధిక శాఖ బాధ్యతులు చూశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంతో పాటు మేడిగడ్డ పియర్స్ కుంగిన సమయంలో నీటిపారుదల శాఖ కేసీఆర్ వద్దే ఉంది. అప్పటివరకు చేసిన విచారణ, అందులో వచ్చిన అంశాల ఆధారంగా కమిషన్ ప్రశ్నావళిని సిద్ధం చేసింది. ఈ విచారణ సమయంలో కమిషన్ ఏం ప్రశ్నించినా సమాధానం చెప్పేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు.
కాళేశ్వరంపై కమిషన్ విచారణకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. pic.twitter.com/YoGvwt889O
— BRS Party (@BRSparty) June 11, 2025
కేసీఆర్ సిద్దం
ప్రాణహిత - చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీఇంజనీరింగ్ మొదలు, ఆనకట్టల నిర్మాణం, టెండర్ సంబంధిత అంశాలు, కాళేశ్వరం కార్పొరేషన్, బ్యారేజీల నిర్వహణపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కేసీఆర్ తో పాటు కొంత మంది ముఖ్యనేతలు మాత్రమే బీఆర్కే భవన్ లోపలకు అనుమతించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ విచారణకు హాజరు అవుతున్న వేళ రాజకీయంగానూ ఉత్కంఠ పెరుగుతోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications