250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

హైదరాబాద్: యాదాద్రిని దేశం గర్వించదగ్గ పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి అభివృద్ధి పనులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని చెప్పిన ఆయన ఈ పనులను ఇకపై వేగం పెంచాలని ఆలయ అధికారులను ఆదేశించారు.

ప్రతి నిర్మాణంకూడా వాస్తు, ఆగమశాస్ర్తాల సూత్రాలకు నూటికినూరుశాతం అనుగుణంగా ఉండాలని సూచించారు. భక్తులను ఆధ్యాత్మిక భావనలో ఓలలాడించేలా టెంపుల్ సిటీ నిర్మాణం జరగాలని సీఎం ఆకాంక్షించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న కల్యాణోత్సవంలో స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్కిటెక్టు ఆనందసాయి, ఈఓ ఎన్ గీతతో ఆలయాభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి రూపొందించిన నమూనాలు, జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుతెన్నులను సీఎంకు వైటీడీఏ వైస్ చైర్మన్ వివరించారు.

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పనులు ఇంకా వేగంగా కొనసాగించాలని సూచించారు. గుట్టమీదికి వెళ్లే రోడ్లు బాగా విశాలంగా ఉండాలన్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇక 250 ఎకరాల విశాలమైన టెంపుల్ సిటీని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

వేలసంఖ్యలో భక్తులు హాజరైనా ఇబ్బంది కలగని రీతిలో హైదరాబాద్‌లోని భారీ ఫంక్షన్‌హాళ్లను మైమరిపించేలా కల్యాణ మండపం నిర్మించాలని చెప్పారు. గుట్ట మీద పార్కింగ్ స్థలం లేనందువల్ల దాదాపు 5 నుంచి 6 వేల వాహనాలు నిలిపేలా విశాలమైన పార్కింగ్ రావాలన్నారు.

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

యాదాద్రికి వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలతో నిత్యాన్నదాన సత్రం నిర్మాణం చేయాలని సూచించారు. యాదాద్రి చుట్టుపక్కలా పర్యాటక క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలని, బస్వాపూర్ వద్ద 200 ఎకరాల్లో మైసూర్ బృందావన్ గార్డెన్‌కు దీటుగా భారీ ఎత్తున పూలవనం ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

యాదాద్రి పట్టణం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్నందున నగర వాసుల రాకపోకలకు మార్గం సుళువవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి పరిచే ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేస్తున్నందువల్ల ఇక్కడి స్థానికులు, వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని అన్నారు.

 250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

కేసీఆర్ ఎవరికీ నష్టం చేయడు. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు మీకు పరిహారం ముట్టినంకనే గుడి పనులు మొదలు పెడుతాం అని యాదాద్రి అభివృద్ధి కార్యక్రమాల్లో దుకాణాలు కోల్పోతున్న వ్యాపారులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

 250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

యాద్రాదిని దేశం గర్వించదగ్గ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన బృహత్ కార్యానికి సహకరించాలని కోరారు. యాదాద్రిలో ఇటీవల రహదారుల విస్తరణలో దుకాణాలు కోల్పోయిన బాధితులు సీఎంను కలిశారు. వారిని శుక్రవారం తన నివాసంలో భోజనానికి రావాలని ఆహ్వానించారు.

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

అన్ని విషయాలు చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మీకు భయం వద్దు.. నా దగ్గరకు రండి.. మీకు అన్యాయం జరగబోదు అని స్పష్టం చేశారు. విస్తరణలో కోల్పోయిన దుకాణాలకు బదులుగా స్థలం కేటాయించటంతోపాటు దుకాణాలు నిర్మించి రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇస్తామని, గృహాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించి ఇస్తామని వారికి చెప్పారు.

 250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

మీకే అనుమానం ఉన్నా నాదగ్గరికి రండి నేనున్నాను అని హామీ ఇచ్చారు. తమకు ముఖ్యమంత్రిపై పూర్తి విశ్వాసం ఉందని బాధితులు ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

ఉదయం 11 గంటలకు హెలికాఫ్టర్‌లో యాదాద్రి హరితహారం వద్దకు చేరుకున్న సీఎంకు విద్యుత్, ఎస్సీ అభివృద్ధి సహకార శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, దేవాదాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బాలూనాయక్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ దుగ్గల్ ఘన స్వాగతం పలికారు.

 250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా కొండపైఉన్న ఆండాళ్ నిలయం చేరుకుని అక్కడినుంచి ఆలయానికి బయలుదేరారు. తూర్పు ద్వారం వద్ద ఆలయ ఈఓ ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు తదితర వేదపండితులు సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

పట్టువస్ర్తాలు, తలంబ్రాలను తలపైదాల్చిన ముఖ్యమంత్రి పంచలక్ష్మీ నరసింహస్వామి గర్భగుడిలో వాటిని సమర్పించారు. తర్వాత కల్యాణమండపంలో రామావతారంలో ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

సమావేశం అనంతరం బయలుదేరిన సీఎంకు రాచర్ల మహేశ్ అనే చేనేత కళాకారుడు తాను స్వయంగా నెయిల్ అండ్ థ్రెడ్ ఆర్ట్ పద్ధతిలో తయారు చేసిన కేసీఆర్ చిత్రపటాన్ని బహూకరించారు.

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

250 ఎకరాల్లో అద్భుతమైన టెంపుల్ సిటీతో పాటు పూలవనం: కేసీఆర్

మేకులకు రంగురంగుల దారాలు చుడుతూ కేసీఆర్ ఆకారం వచ్చేలా సహజత్వం ఉట్టిపడేలా ఈ కళారూపాన్ని తయారు చేశారు. దీని గురించి ఆరా తీసిన సీఎం ప్రపంచంలో ఇది అరుదైన కళారూపమని మహేశ్ వివరించటంతో కళాకారుడిని మెచ్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+