Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ దేశప్రధాని కావాలని మొక్కుకున్నా: మంత్రి మల్లారెడ్డి సంచలనం; మేడారంలో మంత్రుల సందడి!!

ఆసియాలోనే అతిపెద్ద జాతర, విగ్రహాలు లేని విశిష్టమైన జాతర, తెలంగాణ కుంభమేళా అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల మీదకు రావటంతో ఈ రోజు భక్తులు భారీ సంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్ ,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి మల్లారెడ్డి తదితరులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Recommended Video

    Medaram Jatara 2022: Sammakka Saralamma Jatara కు ఈసారి ఒక ప్రత్యేకత| CM KCR | Oneindia Telugu
    కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుకున్నా : మేడారంలో మంత్రి మల్లారెడ్డి

    కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుకున్నా : మేడారంలో మంత్రి మల్లారెడ్డి

    శుక్రవారంనాడు మేడారం జాతరకు వచ్చిన మంత్రి మల్లారెడ్డి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని తాను అమ్మవార్లను కోరుకున్నట్టు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. గతంలో తాను కోరుకున్న కోరికలు అన్నింటిని సమ్మక్క, సారలమ్మలు తీర్చారని, ఇప్పుడు కూడా తన కోరికను అమ్మవార్లు తీరుస్తారని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

     అమ్మవార్ల దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

    అమ్మవార్ల దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్


    ఇక మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కుంభమేళాను తలపిస్తుంది అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మేడారం జాతర ఏర్పాట్లను చేయించారని ఆయన తెలిపారు. అమ్మవార్ల దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

    ఆయురారోగ్యాలతో ప్రజలు, సీఎం కేసీఆర్ జీవించాలి : మంత్రి గంగుల

    ఆయురారోగ్యాలతో ప్రజలు, సీఎం కేసీఆర్ జీవించాలి : మంత్రి గంగుల

    మేడారం మహా జాతర లో సమ్మక్క సారలమ్మలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. సకుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్న మంత్రి గంగుల కమలాకర్ నిలువెత్తు బంగారాన్ని అమ్మ నాకు నైవేద్యం సమర్పించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సీఎం కేసీఆర్ పై నిరంతరం అమ్మవారి దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని, భక్తులకు సకల సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గంగుల కమలాకర్ వెల్లడించారు.

    మేడారంలో సీఎం కేసీఆర్ మొక్కులు

    మేడారంలో సీఎం కేసీఆర్ మొక్కులు

    సమ్మక్క సారలమ్మల గద్దెను పైన కొలువుతీరిన నేపథ్యంలో గిరిజన దేవతలను దర్శించుకోడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మేడారం జాతరకు శుక్రవారం నాడు రానున్నారు. సీఎం కేసీఆర్ మహాజాతరకు రానున్న నేపథ్యంలో పోలీసులు మేడారంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మేడారం మహా జాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు సీఎం కేసీఆర్.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+