వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ స్నాన ముహూర్తం ఖరారు, ఆ నోరే అబద్దాల ఫ్యాక్టరీ: మల్లేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుష్కర స్నానం ఆచరించే ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 14వ తేదీన కెసిఆర్ ఉదయం గం.6.21 నిమిషాలకు నిజామాబాద్ జిల్లాలోని ధర్మపురిలో పుష్కర స్నాం ఆచరించనున్నారు.

ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం నాడు తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రకటించారు. నీటి కొరత లేకుండా మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నామన్నారు. రేపు ఎల్లుండి పుష్కరాల ఏర్పాట్లను మంత్రులు పరిశీలిస్తారన్నారు.

ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుందన్నారు. గోదావరి పుష్కరాలపై కేబినెట్ చర్చిస్తుందని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని చెప్పారు.

KCR will take holy dip on 14th of this month

కెసిఆర్ పైన గుండా మల్లేష్ ఆగ్రహం

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ఏమాత్రం మార్చడం సరికాదని గుండా మల్లేష్ అన్నారు. ప్రజాధనాన్ని వృథా చేయడం సరికాదని ప్రభుత్వానికి సూచించారు. కెసిఆర్ నోరు అబద్ధాల ఫ్యాక్టరీ అని ఎద్దేవా చేశారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ఏమాత్రం మార్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయని నైనాల గోవర్ధన్ హెచ్చరించారు. కేవలం కమీషన్ల కోసమే డిజైన్ మార్చాలనుకుంటున్నారని ఆరోపించారు. తుమ్మిడిహెడ్డి నుంచి కాళేశ్వరం దగ్గరకు ప్రాజెక్టును మార్చడం సొంత ప్రయోజనాల కోసమే అన్నారు. గ్రావిటీ పైన ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.

English summary
KCR will take holy dip on 14th of this month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X