అర్థం చేసుకోండి.. దూరం! నాకు పబ్లిసిటీ అక్కరలేదు: ప్రకాశ్ రాజ్
హైదరాబాద్: తనకు ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లెని ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన గ్రామంలో పర్యటిస్తూ.. సమస్యలు తెలుసుకుంటున్నారు.
దీంతో, మీడియాతో పాటు అందరూ దానిపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కాస్త అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. తాను గ్రామాన్ని దత్తత తీసుకొని, చేస్తున్న పనికి ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదని చెప్పారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామస్తులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. గత నెలలో గ్రామంలో కలెక్టర్ శ్రీదేవి, ప్రకాష్ రాజ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌లు పర్యటించారు. ప్రకాశ్ రాజ్ రాకతో జన సందడి కన్పించింది.

అనంతరం కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ శనివారం ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సన్‌షైన్ ఆస్పత్రి వైద్య బృందం సహకారంతో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.
కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రకాశ్ రాజ్ ఇటీవల దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి తొలి కార్యక్రమం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications