నారా లోకేష్ ఎపికే పరిమితమైతే మంచిది: కవిత
తమ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని కల్వకుంట్ల కవిత అన్నారు. బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తే తమ్మినేని రాజకీయం చేశారని ఆమె అన్నారు. చిన్న జిల్లాలపై లోకేశ్‌వి అవగాహన లేని వ్యాఖ్యలని ఆమె అన్నారు. కొత్త సచివాలయం పాలనా సౌలభ్యం కోసమేనని అన్నారు. మహిళలకు ప్రత్యేక బడ్జెట్‌పై ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలో మహిళలుంటే బాగుంటుందని, అయితే కేసీఆర్‌కు చెప్పే స్థాయి తనది కానది ఆయన తనయ, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వం మహిళల కోసం పెద్ద పీట వేస్తోందని, చాలా కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైతే మంచిదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications