తెలుగు రాష్ట్రాల నుంచి కేరళ.. తక్కువ బడ్జెట్ లో.. పద్మనాభ స్వామి, గురువాయూర్ ఆలయాలు దర్శనం..

దేశంలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. కానీ ఎలా వెళ్లాలి.. దర్శనం ఎలా.. ఛార్జీలు ఎంత.. ఇలా అనేక కారణాల వల్ల తమ ప్రయాణాన్ని వాయిదా వేస్తుంటారు. అలాంటి వారికోసం ఎటువంటి ఇబ్బందీ లేకుండా అతి తక్కువ ధరకే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందుబాటు ధరకే ప్యాకేజీ తెచ్చింది. ఈ టూర్ లో భాగంగా నాలుగు రోజుల్లోనే ప్రముఖమైన పద్మనాభ స్వామి ఆలయం, గురువాయూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. అలాగే పింక్ లగూన్ కూడా చూడొచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చాలా విశిష్టత ఉంది. ఇది ఒక పురాతన, సంపన్నమైన దేవాలయం. ఇక్కడ ఆదిశేషుడిపై పవళించిన శ్రీ విష్ణువు (పద్మనాభుడు) రూపంలో విగ్రహం దర్శనం ఉంటుంది. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ ఆలయ చరిత్ర 9వ శతాబ్దం నుండి మొదలవుతుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. ఆయన ఆదిశేషుడిపై యోగ నిద్రలో ఉంటారు. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత సంపన్నమైన దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే ఈ ఆలయంలోని రహస్య ఖజానా 'బీ' లో ప్రపంచంలోనే అత్యంత విలువైన నిధులు ఉన్నాయని నమ్ముతారు. దీనిని నాగ మంత్రాలతో మూసి వేశారని.. దీన్ని తెరవడం చాలా ప్రమాదకరమని పండితులు చెబుతారు. మరి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది.

ఎలా వెళ్లాలి..?

ఈ ఆలయానికి వెళ్లాలంటే తిరువనంతపురం నార్త్ అనే ట్రెయిన్ ఎక్కాలి. ఏసీ టికెట్ ధర రూ. 1600 ఉంటుంది. ఖమ్మం స్టేషన్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఉంటుంది. ఈ రైలు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, చెన్నై సెంట్రల్, కాట్ పాడీ, సాలెం స్టేషన్ల మీదుగా మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు తిరువనంతపురం నార్త్ కు చేరుకుంటుంది. స్టేషన్ నుంచి టెంపుల్ కు రూ. 50 ఛార్జీ ఉంటుంది. టెంపుల్ వద్ద రూమ్ తీసుకోవాలంటే రూ. 300 ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో దర్శనం చేసుకుంటే మంచి అనుభూతి కలుగుతుంది.

Kerala Temple Tour from Khammam Visit Padmanabha Swamy and Guruvayur by Train

గురువాయూరు శ్రీకృష్ణ మందిరం..

గురువాయూర్ శ్రీకృష్ణ మందిరం కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా గురువాయూర్ పట్టణంలో ఉంది. ఇది విష్ణువు రూపమైన గురువాయూరప్పన్‌ కు అంకితం అయిన హిందూ దేవాలయం. ఇక్కడి శ్రీకృష్ణుడి ఆలయంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయానికి చెందిన 108 అభిమాన క్షేత్రాలలో ఒకటిగా అలరారుతోంది. అలాగే ఈ ఆలయానికి వెళ్లే దారిలో పింక్ లగూన్ కూడా ఉంటుంది.

ఈ ఆలయానికి చేరుకోవాలంటే పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం అనంతరం తిరువనంతపురం నార్త్ స్టేషన్ కు వచ్చి కొట్టాయం రైలు ఎక్కాలి. ప్రతి 10 నిమిషాలకు కొట్టాయానికి రైళ్లు ఉంటాయి. టికెట్ ధర రూ. 90 గా ఉంది. కొట్టాయం నుంచి రోడ్డు మార్గంలో బస్ లో రూ. 30 తో పింక్ లగూన్ చేరుకోవచ్చు. ఇక్కడ ఒక్కో రైడ్ కు రూ. 100 చెల్లించాలి. ఇక్కడి అందాలను తిలకించాక మళ్లీ త్రిస్సూర్ కు వెళ్లాలి. టికెట్ ధర రూ. 30 ఉంటుంది. త్రిస్సూర్ నుంచి బస్ లో రూ. 35 టికెట్ తో గురువాయుర్ ఆలయానికి చేరుకోవచ్చు. గురువాయుర్ ఆలయంలో రాత్రి 8 గంటలకు దర్శనం పూర్తవుతుంది. మళ్లీ త్రిస్సూర్ వచ్చి రిటర్న్ టికెట్ రూ. 1500 తో పాట్నా ఎక్స్ ప్రెస్ లో ఖమ్మం చేరుకోవచ్చు. ఇలా ఒక్కో వ్యక్తికి రూ. 5000 వరకు ఖర్చు అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+