ఎస్ఐది ఆత్మహత్యే: సూసైడ్ నోట్‌లో ఇలా రాశారు(పిక్చర్స్)
ఆదిలాబాద్: మెదక్ జిల్లాలో సబ్‌ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారుల ఒత్తిళ్లే కారణమంటూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను మరిచిపోక ముందే... రాష్ట్ర పోలీసు శాఖలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి ఎస్సై కాసమేని శ్రీధర్(28) మంగళవారం ఉదయం తానుండే క్వార్టర్‌లోనే కణతపై తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మొదట మిస్ ఫైరింగ్‌గా భావించినా.. సూసైడ్ నోట్ దొరకడంతో ఆత్మహత్యగా నిర్ధారణ అయ్యింది.

సూసైడ్ నోట్
తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దుర్ఘటనకు ముందు రాసిన లేఖలో శ్రీధర్ పేర్కొన్నారని అదనపు ఎస్పీ రాధిక ప్రకటించారు. ఎలాంటి ఒత్తిడికి లోనయ్యారనే వివరాలు అందులో ప్రస్తావించలేదన్నారు.

ఎస్ఐ మృతదేహం
అయితే, శ్రీధర్ ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని, అంతటి కష్టాలూ లేవని, తనకింకా పెళ్లే కాలేదని, సంఘటన అనుమానాస్పదంగా ఉందని హతుడి తండ్రి ధర్మయ్య, సోదరుడు పేర్కొనడం గమనార్హం.

ఎస్ఐ శ్రీధర్ మృతదేహం
మంగళవారం ఉ.8.15గంటలకు శ్రీధర్ క్వార్టర్ నుంచి తుపాకి పేలిన శబ్దం వచ్చింది. పనిమనిషి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎస్సై గదిలోకి వెళ్లి చూడగా ఆయన అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఎస్ఐ శ్రీధర్ (ఫైల్)
కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరుకు చెందిన సామాన్య వ్యవసాయదారులు స్వతంత్ర, ధర్మయ్యల రెండో కుమారుడు శ్రీధర్. పోలీసు శాఖలో ఉద్యోగం కోసం ఆయన ఎన్నో కలలుగన్నారు. 2013లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక పరీక్షలు రాశారు. కానిస్టేబుల్‌గా ఎంపికై కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో చేరారు. తర్వాత ఎస్సై ఉద్యోగానికీ ఎంపికవడంతో 2014లో ఎస్సై శిక్షణకు వెళ్లి, 2015 నవంబర్‌లో పూర్తిచేశారు. 2016 మార్చి నుంచి ఆగస్టు వరకు కెరమెరిలో శిక్షణ ఎస్సైగా పనిచేశారు. ఆగస్టు 27న అక్కడే పూర్తికాలపు ఎస్సైగా పోస్టింగ్ ఇవ్వడంతో ఆ రోజే బాధ్యతలు స్వీకరించారు. నాలుగు రోజులైనా గడవక ముందే ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications