ప్రముఖ సాహిత్యవేత్త కేశవరెడ్డి వర్ధంతి సభ: స్మృతి సంపుటి ఆవిష్కరణ

హైదరాబాద్: ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవ రెడ్డి ప్రథమ వర్ధంతి సభ ఈ నెల 13వ తేదీ సాయంత్రం హైదరాబాదులో జరగనుంది. ఈ సంస్మరణ సభ 13వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు దోమలగుడాలో ఇందిరా పార్కు సమీపంలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో జరుగుతుంది.

ఈ సందర్భంగా కేశవ రెడ్డి స్మృతి సంపుటి ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఈ సభలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. వరవర రావు, మోహన్, నిఖిలేశ్వర్, డాక్టర్ సాయినాథ్, జయప్రభ, విమల, కాండ్రేగుల నాగేశ్వర రావు పాల్గొంటారు.

Keshav Reddy's death anniversary meeting in Hyderabad

వారితో పాటు వాడ్రేవు చినవీరభద్రుడు, అంబటి సురేంద్ర రాజు, నందిగం కృష్ణారావు, గోరటి వెంకన్న, పరవస్తు లోకేశ్వర్, దెంచనాల శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, నాళేశ్వరం శంకరం, గుడిపాటి కూడా కేశవ రెడ్డి ప్రథమ వర్థంది సంస్మరణ సభలో పాల్గొంటారు.

కేశవ రెడ్డి రాముండాడు రాజ్యముండాది. అతడు అడవిని జయించాడు, మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, మునెమ్మ వంటి నవలలు రాసి తెలుగు నవలా సాహిత్యంలో తనకు సాటిలేదని నిరూపించుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన కేశవ రెడ్డి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని విక్టోరియా ఆస్పత్రిలో పనిచేసి అక్కడే స్థిరపడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+