బోల్తాపడిన కేశినేని బస్సు: 20 మందికి గాయాలు
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటిక్యాల మండలం కొండేరు సమీపంలో కేశినేని ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బస్సు వేగంలో ఉండి ఎదురుగా ఉన్న వాహనాన్ని క్రాస్ చేసే సమయంలో డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రాయిని ఎక్కడం వల్లే బస్సు బోల్తా పడిందని మరికొంత మంది చెబుతున్నారు.












Click it and Unblock the Notifications