కాసేపట్లో కదలనున్న ఖైరతాబాద్ గణేణుడు: దిగిన 6 వేల కిలోల లడ్డు
హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు కొద్దిసేపట్లో నిమజ్జనానికి కదలనున్నాడు. ఆరు వెల కిలోల లడ్డూను నిర్వహకులు కిందికి దించారు. ఈ లడ్డూ ప్రసాదాన్ని ఈ నెల 30వ తేదీన గణేష్ మండపం వద్ద పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
స్వామి విగ్రహం చుట్టూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు స్వామిని శోభా యాత్రకు సిద్ధం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిమజ్జన కార్యక్రమం పూర్తి కావచ్చునని భావిస్తున్నారు.

కాగా, ఆదివారం నుంచి హుస్సేన్ సాగర్‌లో వినాయకుల నిమజ్జన కార్యక్రమం సాగుతూనే ఉంది. శోభా యాత్ర హైదరాబాద్‌లో మొజంజాహీ మార్కెట్‌కు చేరుకుంది. వినాయకుల విగ్రహాలు బషీర్‌బాగ్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు బారులు తీరి ఉన్నాయి. బషీర్ బాగ్ వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
హైదరాబాదులోని గన్‌ఫౌండ్రీలో 22 అడుగుల గణేశుడి విగ్రహాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడింది. ఈ సంఘటనలో కొందరు భక్తులు గాయపడ్డారు. ఆదివారం ఉదయం నుంచి హుస్సేన్ సాగర్‌కు విగ్రహాలు తరలి వస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి గానీ నిమజ్జన కార్యక్రమం పూర్తి కాదు.












Click it and Unblock the Notifications