• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Ganesh Immersion : గణేశ్ నిమజ్జనంపై ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం

|

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి వినాయక విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. ఉన్నచోటే నిమజ్జనానికి అనుకూలంగా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. ప్రతీ ఏటా హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి హైకోర్టు అనుమతి నిరాకరించింది. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.అందుకే వచ్చే ఏడాది నుంచి వినాయక మండపంలోనే నిమజ్జనం చేయాలని కమిటీ తీర్మానించింది.

హుస్సేన్ సాగర్‌లో ఈ ఒక్క ఏడాది వరకు పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయగా... హైకోర్టు దాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే.గణేశ్ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని యధావిథిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. బుధవారం(సెప్టెంబర్ 14) ఉదయం దీనిపై విచారణ జరగనుంది.

khairatabad ganesh utsav committee key decision over ganesh immersion

జీహెచ్ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.'తనకు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన విగ్రహాలే పెట్టాలని వినాయకుడు కోరుకోలేదు. దేవుడి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని పురాణాల్లోనూ ఎక్కడా పేర్కొనలేదు. జీహెచ్‌ఎంసీ చట్టంలోనే జల కాలుష్యం జరగకుండా చూడాలని ఉంది. ఈ చట్టం వచ్చి 66 ఏళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ విగ్రహాల నిమజ్జనం పేరుతో కాలుష్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ కాలుష్యకాసారంగా తయారైంది.' అని హైకోర్టు మండిపడింది.

చూస్తూ చూస్తూ పొల్యూషన్‌కు అనుమతినివ్వాలా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వినాయక చవితికి ముందే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం వద్దని తీర్పునిస్తే.. అందుకు తగినట్లు ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేదని నిలదీసింది. తీరా ఇప్పుడొచ్చి సమయం లేదని.. కరోనా ఉందని,భక్తుల మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరడం సబబు కాదని పేర్కొంది. జీహెచ్ఎంసీ 1955 యాక్ట్ సెక్షన్ 522 నీటిలో కెమికల్ వస్తువులు కలపకూడదని చెబుతోందని గుర్తుచేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ చట్టం అమలుకాకపోతే ఎలా అని మండిపడింది.సుందరీకరణ పేరుతో ఏటా ట్యాంక్‌బండ్‌పై వివిధ పనులు చేపట్టడం... వినాయక నిమజ్జనం సమయంలో వాటిని ధ్వంసం చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఎన్నిసార్లు ప్రజాధనాన్ని వృథా చేస్తారని ప్రశ్నించింది.

హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇప్పటివరకూ నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో.. నగరంలో ప్రతిష్ఠించిన వేలాది గణపయ్యల నిమజ్జనం ఎలా చేయాలో తెలియట్లేదు. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు నగరం పరిధిలో లేవని.. హైకోర్టు మినహాయింపునివ్వని పక్షంలో గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని.... 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామని జీహెచ్ఎంసీ హైకోర్టుకు తెలిపినప్పటికీ న్యాయస్థానం ఆ వాదనను తోసిపుచ్చింది.హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలుచేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇష్టం లేకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చునని తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టులోనూ ప్రభుత్వానికి చుక్కెదురైతే అధికార యంత్రాంగం ఏ చర్యలు చేపడుతుందనేది వేచి చూడాలి.

English summary
The Khairatabad Ganesh Utsav Committee has taken a key decision. It has been decided to immerse the idol of Vinayaka in the mandapam only, from next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X