హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైరతాబాద్‌ మహాగణపతికి గవర్నర్‌ తొలి పూజ: తాపేశ్వరం భారీ లడ్డూ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖైరతాబాద్‌ మహాగణపతికి తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు గురువారం ఉదయం తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు గవర్నర్‌ దంపతులను శాలువాతో సత్కరించారు.

స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

మహాగణపతికి 5వేల 600కేజీల లడ్డూ

59 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పార్వతీ తనయుని కోసం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరానికి చెందిన వ్యాపారి మల్లిబాబు 5వేల 600 కిలోల లడ్డూను సమర్పించారు. గత ఏడు సంవత్సరాలుగా మల్లిబాబు ఖైరతాబాద్ మహాగణపతికి లడ్డూను ప్రసాదంగా అందిస్తూ వస్తున్నారు.

అలాగే ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 75 అడుగుల జంజం, 75 అడుగుల కండువాను సమర్పించనున్నారు. చేనేత కార్మికులు 20రోజులు నేసిన కండువా, జంజలాను హనుమాన్ దేవాలయంలో భద్రపరిచారు. గురువారం ఉదయం 7 గంటలకు వేద పండితులు, మంగళవాయిద్యాల నడుమ సమర్పించారు.

ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్‌ మహాగణపతికి తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు గురువారం ఉదయం తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు గవర్నర్‌ దంపతులను శాలువాతో సత్కరించారు.

ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణపతి

స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణపతి

బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు.

ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణపతి

ఇద్దరు డిఎస్పీల పర్యవేక్షణలో ఏసిపిలు, సిఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు బందోబస్తును నిర్వహించనున్నారు.

ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణపతి

అణువణువు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు ఉత్సవ కమిటీ ప్రత్యేక సెక్యూరిటీ, వాలంటీర్లను నియమించింది. వీరికి సైతం పోలీసులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణపతి

ఎవరైనా అనుమానితులు, అనుమానిత వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిసిపి కమలహాసన్ రెడ్డి సూచించారు.

ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణపతి

నిత్యం రద్దీగా ఉండే భారీ గణపతి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను నియంత్రించారు.

ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణపతి

రైల్వేగేట్ వద్ద నుంచి ఈ బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు అటుగా వచ్చే వాహనాలను గేట్ పక్కగా ఉన్న దారుల గుండా తరలిస్తున్నారు. ఈ ఏడు భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు చిరువ్యాపారులను అనుమతించలేదు.

ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణపతి

తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ వినాయక విగ్రహ మండపం వద్ద రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ నుంచి 27 వరకు జరుగనున్న వినాయక ఉత్సవాల సందర్భంగా ‘జియోనెట్' వైఫై సేవలను అందించనుంది.

మహాగణపతికి తాపేశ్వరం లడ్డూ

మహాగణపతికి తాపేశ్వరం లడ్డూ


59 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పార్వతీ తనయుని కోసం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరానికి చెందిన వ్యాపారి మల్లిబాబు 5వేల 600 కిలోల లడ్డూను సమర్పించారు.

మహాగణపతికి తాపేశ్వరం లడ్డూ

మహాగణపతికి తాపేశ్వరం లడ్డూ

గత ఏడు సంవత్సరాలుగా మల్లిబాబు ఖైరతాబాద్ మహాగణపతికి లడ్డూను ప్రసాదంగా అందిస్తూ వస్తున్నారు.

మహాగణపతికి తాపేశ్వరం లడ్డూ

మహాగణపతికి తాపేశ్వరం లడ్డూ

అలాగే ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 75 అడుగుల జంజం, 75 అడుగుల కండువాను సమర్పించారు.

మహాగణపతికి తాపేశ్వరం లడ్డూ

మహాగణపతికి తాపేశ్వరం లడ్డూ

చేనేత కార్మికులు 20రోజులు నేసిన కండువా, జంజలాను హనుమాన్ దేవాలయంలో భద్రపరిచారు.

మహాగణపతికి తాపేశ్వరం లడ్డూ

మహాగణపతికి తాపేశ్వరం లడ్డూ

గురువారం ఉదయం 7 గంటలకు వేద పండితులు, మంగళవాయిద్యాల నడుమ సమర్పించారు.

English summary
The 59 feet Khairatabad Ganesh 2015 will be in the style of Thrishaktimaya Moksha Ganapathi for the Ganesh Chathurthi that begins on September 17 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X