భద్రాచలం వద్ద గోదావరిలో పడిన బస్సు (పిక్చర్స్)

ఖమ్మం: భద్రాచలం సమీపంలోని సారపాక వంతెన వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. నలభై మంది గాయపడ్డారు.

ఖమ్మం నుండి భద్రాచలం వస్తున్న ఆర్టీసీ బస్సు ఏపీ 20 జెడ్ 0026 సారపాక వద్ద ఆటోను తప్పించే క్రమంలో ప్రమాదానికి గురైంది.

అప్రోచ్ రెయిలింగ్ వద్ద మట్టి ఉండటంతో బస్సు అదుపు తప్పి గోదావరి వంతెన సమీపంలోని 75 అడుగుల లోయలోకి ఫల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో కండక్టర్, డ్రైవర్ సహా 44 మంది ఉన్నారు.

 బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డుపై నుంచి 70 అడుగుల లోతుకు పల్టీలు కొడుతూ వెళ్లి బొల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు (40), దుమ్ముగూడెం మండలం సింగారానికి చెందిన బొడ్డు శ్రావణి (30) అనే ప్రయాణికురాలు మరణించారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆర్టీసీ భద్రాచలం డిపోకు చెందిన రామబాణం బస్సు గురువారం ఖమ్మం నుంచి భద్రాచలానికి తిరుగుప్రయాణమైంది. దారిలో గోదావరి బ్రిడ్జికి అతి సమీపంలో సారపాక వద్ద ఎదురుగా ఆటో రావడంతో డ్రైవర్‌ వెంకటేశ్వర్లు బస్సును పక్కకు తప్పించబోయాడు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే బస్సు బోల్తాపడిపోయింది.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

అనూహ్య ప్రమాదంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణికులు సహాయం కోసం పెద్దగా కేకలు పెట్టారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు భద్రాచలం నుంచి సారపాక వైపు వస్తున్న వాహన చోదకులు, భద్రాచలం రెండో వారథి పనిలో నిమగ్నమైన సిబ్బంది ఉరుకుల పరుగుల మీద అక్కడికి చేరుకుని అప్రోచ్ రోడ్డుపై నుంచి కిందకు దిగి బస్సులోని ప్రయాణికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.

 బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

బస్సు తీవ్రంగా ధ్వంసమవడంతో ప్రయాణికులను బయటకు తేవడం చాలా కష్టమైంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ప్రయాణికులను బయటకు తీసపి క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి, పట్టణంలోని ఇతర ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు.

బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

గాయపడినవారిలో బొడ్డు గాయత్రి, షబీనా బేగం, రాణి, వాణి, పద్మ, ఆస్లీల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. శ్రావణి ప్రమాద స్థలిలోనే మృతి చెందగా, డ్రైవర్‌ వెంకటేశ్వర్లు తలకు తీవ్రగాయాలు కావడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

 బస్సు ప్రమాదం

బస్సు ప్రమాదం

మృతుడిది భద్రాచలం పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీ. కాగా మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌‌గ్రేషియా అందిస్తామని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, మహేందర్ రెడ్డి తెలిపారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రమాదం గురించి తెలియగానే ప్రత్యేక హెలికాప్టర్‌లో వారిద్దరూ భద్రాచలం చేరుకుని ఏరియా వైద్యశాలలో బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+