ప్రేమ, పెళ్లి అంటూ అందంతో వల: రూ. కోట్లు కాజేసిన కిలాడీ లేడీ ప్రియదర్శిని ఫొటోలు రిలీజ్
Recommended Video

హైదరాబాద్: ప్రేమ, పెళ్లి పేరుతో ఎంతో మంది యువకులను, వ్యాపారవేత్తలను మోసం చేసిన ఓ కిలాడీ లేడీని పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలను విడుదల చేశారు.
తమిళనాడులోని చెన్నైకి చెందిన ఆ యువతి.. తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్ నగరాల్లో పలువురిని ఈ విధంగా మోసం చేసింది. ఇప్పుడు ఆమె తన మకాంను బెంగళూరుకు మార్చినట్లు తెలిసింది.

ఐదురోజుల్లో ప్రేమ, పెళ్లి..
చెన్నైకి చెందిన కిలేడీ లేడీ ప్రియదర్శిని మోసాలు గమనించినట్లయితే.. వరంగల్‌లో ఓ ప్రముఖుడి కుమారుడిని కేవలం ఐదు రోజుల్లో ప్రేమ పేరిట ముగ్గులోకి దింపి, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత డబ్బు, ఆభరణాలతో ఉడాయించింది. ప్రియదర్శినికి స్నేహ అనే మరో పేరు కూడా ఉంది.

వరుస మోసాలతో ఫొటోలు రిలీజ్.. బెంగళూరుకు మకాం
వరుస మోసా లనేపథ్యంలో ప్రియదర్శిని గురించిన మరిన్ని వివరాలను, ఆమె ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఆమె బెంగళూరు పారిపోయిందని సమాచారం అందిందని అన్నారు.

డాక్టర్ అంటూ లక్షలు కాజేసింది..
ఓ యువకుడికి డాక్టర్‌గా పరిచయం చేసుకుని రూ. 5 లక్షలను, అతని స్నేహితుల నుంచి రూ. 10 లక్షలను ఆమె దొంగిలించిందని చెప్పారు. అంతేగాక, వరంగల్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా షోరూములో రూ. 75 లక్షలకు చెక్కులిచ్చి నాలుగు కార్లు కొనుగోలు చేయగా, అవి బౌన్స్ అయ్యాయని వెల్లడించారు.

చెల్లని చెక్కుతో 17లక్షల కారు కొనింది
అంతేగాక, హైదరాబాద్‌లోని రాంనగర్ ప్రాంతంలో ఉన్నహ్యుండాయ్ షోరూంలో 17 లక్షల చెక్కులిచ్చి ఓ కారును కొనుగోలు చేసింది. వరంగల్ ఎంజీఎంలో ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తున్నానని నమ్మబలకడంతో షోరూమ్ నిర్వాహకులు మోసపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు.

వారే ఆమె టార్గెట్
సంపన్నుల పిల్లలను లక్ష్యంగా ఎంచుకుని, వారిని ముగ్గులోకి దించి సీక్రెట్‌గా వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత అందిన కాడికి డబ్బు, నగలు దోచుకుంటుందీ కిలాడీ లేడీ. కాగా, చెన్నై నుంచి రూ. 3 వేలతో వరంగల్ వచ్చి, దాదాపు రూ. కోటికి పైగా మోసం చేసిందని, ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications