అందుకే మోడీ మళ్లీ ప్రధాని కావాలి: సికింద్రాబాద్‌లో ఖుష్బు ప్రచారం
హైదరాబాద్: నిమిషం కూడా సమయాన్ని వృథా చేయకుండా దేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారన్నారు బీజేపీ నేత, నేషనల్ ఉమెన్ కమిషన్ ఖుష్బూ సుందర్. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రంలో బీజేపీని గెలిపించాలని ఖుష్బు కోరారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన బైక్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ. కంటోన్మెంట్ సమస్యను తీర్చేది కేంద్రమేనని.. ఇక్కడి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

400 సీట్లతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ విజయఢంకా మోగించడం ఖాయమని ఖుష్బు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో డిజిటల్ రంగంలో, విమానయాన, రైల్వే, త్రివిధ దళాలు, జాతీయ రహదారులు, ఇలా అన్ని రంగాల్లో వృద్ధి సాధించామని ఆమె వివరించారు.
తెలంగాణవిజయ సంకల్పయాత్రలో భాగంగా భాగ్యలక్ష్మి క్లస్టర్ లో ముఖ్య అతిథిగా జాతీయ మహిళా కమిషన్ సభ్యులు శ్రీమతి @khushsundar గారు పాల్గొన్నారు.
— BJP Telangana (@BJP4Telangana) February 29, 2024
దేశంలో పదేళ్లుగా మహిళల అభ్యున్నతి, సాధికరితకు కృషి చేస్తున్న ప్రధాని శ్రీ @narendramodi గారి నాయక్వతానికి మరోసారి మద్దతు ఇవ్వాలని… pic.twitter.com/n9hmleF3sl
మహిళలు, యువతకు అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు కుష్బు తెలిపారు. కరోనా విపత్కర సమయంలో అందరికీ ఉచితంగా టీకాలు ఇచ్చామన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించారని ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో గొప్ప అవకాశాలను కల్పించిందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన తప్ప.. దేశానికి చేసిందేమీ లేదని ఖుష్బు విమర్శించారు.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications