దాసరి నారాయణ రావు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
ప్రముఖ సినీ దర్శకులు, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు ఆరోగ్యం పైన కిమ్స్ ఆసుపత్రి వైద్యులు గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకులు, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు ఆరోగ్యం పైన కిమ్స్ ఆసుపత్రి వైద్యులు గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఆయన రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
దాసరి ఆరోగ్యం మెరుగు పడిందని బులెటిన్‌లో తెలిపారు. మూడు రోజుల్లో వెంటిలెటర్ తొలగిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో దాసరిని ఐసీయూలో ఉంచి వెంటిలెటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాసరి మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, అన్నవాహికలో ఇన్‌ఫెక్షన్ బాధపడుతున్నారి వైద్యులు చెప్పారు. మూత్రపిండాలకు డయాలసిస్ చేశారు.












Click it and Unblock the Notifications