తెలంగాణ అందరికి లైఫ్ ఇస్తోంది... స్పీచ్‌తో అదరగొట్టిన కింగ్ నాగార్జున
దసరా పండుగ అనగానే తెలంగాణలో గుర్తొచ్చే సాంస్కృతిక వేడుకల్లో 'అలయ్ బలయ్' ఒకటి. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో రెండు దశాబ్దాలుగా ఘనంగా జరుగుతున్న ఈ వేడుక 2025లోనూ అంబరాన్ని తాకింది. ఈసారి ఈ వేదికపై కింగ్ అక్కినేని నాగార్జున తనదైన స్పీచ్‌తో అదరగొట్టి, అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ 'అలయ్ బలయ్' కార్యక్రమంలో నాగార్జునను ప్రత్యేకంగా సత్కరించారు. దీనిపై నాగార్జున ఆనందం వ్యక్తం చేస్తూ, "ఇలా నన్ను సత్కరించడం ఇదే మొదటిసారి. చాలా కొత్తగా, ఎంతగానో సంతోషంగా ఉంది" అంటూ దత్తాత్రేయకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకకు అన్ని రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరవడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. "రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికపైకి రావడం అభినందనీయం. ఇది మన తెలుగు సంస్కృతి, ఐక్యతకు ప్రతీక. ఇంతమంది ప్రముఖులు ఒకేచోట చేరడం మాకు (సెలబ్రిటీలకు) ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది" అని నాగార్జున పేర్కొన్నారు.
ఈ గొప్ప కార్యక్రమాన్ని 20 ఏళ్లుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ కృషిని నాగార్జున కొనియాడారు. అంతేకాక, దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా ఈ సంప్రదాయాన్ని స్ఫూర్తితో కొనసాగిస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
సాంస్కృతిక వారసత్వాన్ని, సామరస్యాన్ని ప్రతిబింబించే ఇలాంటి వేడుకలు సమాజానికి ఎంతో అవసరమని కింగ్ నాగార్జున తన అభిప్రాయాన్ని బలంగా చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడుకకు హాజరైన సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తెలుగువారి ఆత్మీయతను మరోసారి చాటారు.












Click it and Unblock the Notifications