కేసీఆర్ సర్కారు తీరుతో రైతులకు తీవ్ర నష్టం: రాజకీయ పార్టీలకే నిధులంటూ కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను వదిలేసి.. రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మినహా అన్ిన రాష్ట్రాలు పేదల కోసం లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాయన్నారు. పంటల బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవట్లేదని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఎరువుల రాయితీ కోసం కేంద్రం రూ. లక్ష కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పెరిగిన ధరల ప్రభావం రైతులపై పడకూడదని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాయితీ పెంచిందన్నారు. ఒక్కో ఎరువుల సంచిపై రూ. 2వేలకు పైగా రాయితీ ఇస్తోందని తెలిపారు.

పంటల బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవట్లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఏటా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ధ్వజమెత్తారు. అకాల వర్షాలకు తెలంగాణ రైతాంగం నష్టపోతే బీఆర్ఎస్ నాయకులు మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
పేదలకు డబల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించకుండా.. ప్రగతి భవన్, సచివాలయాన్ని రికార్డ్ సమయంలో కట్టానని చెప్పడం ఎంతవరకు సమంజసమని కేసీఆర్ సర్కారును నిలదీశారు కిషన్ రెడ్డి. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మే 30 నుంచి జూన్ 30 వరకు జరిగే మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాకి ప్రజలు మద్దతివ్వాలన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.












Click it and Unblock the Notifications