Telangana assembly: బీజేపీ ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి జాగ్రత్తలు!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి మార్గనిర్దేశం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి సూచించారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా గళమెత్తాలన్నారు. అయితే, శాసనసభలో మాట్లాడే సమయంలో ఉపయోగించే భాష విషయంలో నిబంధనలకు విరుద్ధంగా కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
మాట్లాడాలనుకునే అంశాన్ని ముందుగానే నిర్ణయించుకుని.. ఎవరు ఏ అంశంపై మాట్లాడాలో ప్లాన్ చేసుకోవాలన్నారు. ఈ విషయాలను గుర్తుపెట్టుకుని అసెంబ్లీలో మాట్లాడే విధంగా సన్నద్ధం కావాలని కిషన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించారు. కాగా, అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలకు సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది ఇలా ఉండగా, శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై స్పందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పరు. మరో పది శాతం పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలు అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. రూ. 26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయని, మరో 12 కోట్లతో రెండో విడత పులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
బేగంపేటలో అందరూ మహిళలే ఉద్యోగులు ఉండేలా చూస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌కు వస్తే ముక్కు మూసుకునే పరిస్థితి ఉండేదని.. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ ద్వారా స్వచ్ఛ రైల్వే స్టేషన్ పేరుతో వినూత్న మార్పులు తీసుకొచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. చర్లపల్లి రై్ల్వే స్టేషన్‌ని కూడా ఆధునాతనంగా నిర్మించుకుని ప్రారంభించామన్నారు.
మరోవైపు, త్రిభాష విధానంపై జరుగుతున్న దుష్ప్రచారంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. త్రిభాష విధానం దేశంలో కొత్తేమీ కాదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విధానం ఉందన్నారు. ఏ ఒక్కరిపై కూడా బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయలేదన్నారు. ఏ భాష కావాలంటే అందులోనే చదువుకునే అవకాశం ఉందన్నారు.
With 40 Amrit Bharat Stations being redeveloped across Telangana, the @narendramodi govt. is committed to enhancing rail infrastructure and ensure a modern travel experience for the passengers.#AmritBharatStation @RailMinIndia @SCRailwayIndia pic.twitter.com/TToAJPetnk
— G Kishan Reddy (@kishanreddybjp) March 15, 2025
తమిళ భాషలో తీసిన సినిమాలో హిందీలో డబ్ చేసి రూ. కోట్ల లాభాలను నిర్మాతలు పొందుున్నారన్నారు. వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయి? భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడటం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఏం చేశాడో చెప్పి తమిళనాడు ప్రజల్ని ఓట్లు అడగాలన్నారు. ఆయనేం చేయలేదు కాబట్టే భాష పేరుతో దుష్ప్రచారం చేస్తూ ఎన్నికలు దాటేయాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని కొందు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంో ఉన్నప్పటి విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గా పునర్విభజనపై కొత్త విధానం రాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications