Kishan Reddy: అక్కడ రైళ్లు ఆపాల్సిందే.. లేఖ రాసిన కిషన్ రెడ్డి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు చోట్ల రైళ్లు ఆపాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. మహబూబ్‌‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆపాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. యశ్వంత్ పూర్-హజరత్ నిజా ముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలును ( ట్రైన్​ నెం.12649/12650) మహబూబ్ నగర్ లో ఆపాలని కోరారు. తెలంగాణలో కాచిగూడ మీదుగా వెళ్లే ఈ ట్రైన్ కర్నూలు చేరుకునే వరకు 200 కి.మీ మేర మధ్యలో ఎక్కడా ఆగదని గుర్తు చేసిన మంత్రి మహబూబ్ నగర్ లో ఆపితే బాగుంటుందన్నారు.

మహబూబ్ నగర్​ లో రైలు ఆగినట్లయితే ఢిల్లీ, బెంగళూరు ప్రయాణించే వారికి హైదరాబాద్‌‌కు రావాల్సిన అవసరం ఉండదని లేఖలో వివరించారు. చెంగల్ పట్టు-కాచిగూడ ఎక్స్‌‌ప్రెస్ (ట్రైన్​ నెం.17651/17652)కు షాద్‌‌నగర్ రైల్వే స్టేషన్ లో ఆపాలన్నారు. దీంతో హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాలలోని ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. తెలంగాణలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో గణనీయమైన పురోగతి జరుగుతోందని, మౌలికవసతుల కల్పన వేగవంతమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ట్రైన్ కోచ్‌ల సంఖ్యను పెంచుతామన్నారు.

Kishan Reddy

వందే భారత్ రైలులో ప్రస్తుతం 8 కోచ్‌లు ఉండగా, ప్రయాణికుల కోరిక మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి 16 కోచ్‌లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో 52 సీట్లు, చైర్‌కార్‌లో 478 సీట్లతో మొత్తం 530 సీట్లు ఉన్నాయి. ఈ రైలు ఆక్యుపెన్సీ ఏప్రిల్‌లో 131 శాతంగా నమోదైంది. అలాగే తిరుపతి నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు ఏప్రిల్‌లో 136 శాతం, మే నెలలో 137 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

Kishan Reddy

మరోవైపు ఉదయం 6గంటలకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి బయల్దేరుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20701) రైలు మే 17 నుంచి ఉదయం 6.15 గంటలకు బయల్దేరనుంది. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరే రైలు(20702) నిర్ణీత స్టేషన్లలో ఆగుతూ అదే రోజు రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+