ఆ ఫ్యామిలీకి సింగరేణి బలి: భారీగా పెరిగిన అప్పులు, తగ్గిన పర్మినెంట్ ఉద్యోగులు: కిషన్

న్యూఢిల్లీ: కేసీఆర్ కుటుంబం జోక్యం విపరీతంగా పెరిగిపోవడంతో సింగరేణి పరిస్థితి దయనీయంగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కార్మికుల కష్టార్జితంతో కొనసాగుతున్న సింగరేణి సంస్థను.. కేసీఆర్ ప్రభుత్వం భక్షిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ బంగారు గని బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు.

సింగరేణి బీఆర్ఎస్ నాయకుల జేబు సంస్థగా మారిపోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి అధికారులు ఇవాళ చిన్న పనికి కూడా ఎమ్మెల్యేల ఇంటికెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చివరకు కార్మికుల డ్యూటీ షిఫ్టింగ్ మార్చాలన్నా అధికార పార్టీ నాయకుల జోక్యం ఎక్కువైందన్నారు. సింగరేణి పరిపాలన పూర్తిగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని.. ఈ సాకుతోనే బీఆర్ఎస్ నాయకులు ప్రైవేటీకరణ అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Kishan Reddy slams kcr

సింగరేణి అప్పులు రూ. 10వేల కోట్లకు పెరిగాయని కిషన్ రెడ్డి చెప్పారు. కార్మికులపై పని భారం విపరీతంగా పెంచేశారని అన్నారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని బీఆర్ఎస్ నేతలు భక్షిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బొగ్గు గనుల వేలంలో ప్రభుత్వం పాల్గొనట్లేదని విమర్శించారు. టెండర్లు కూడా వేయకుండా బాధ్యత విస్మరించారని మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల దృష్ట్యా కొత్త పల్లవి అందుకున్నారని.. ప్రధానికి వ్యతిరేకంగా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. విశాఖ కార్మికుల పాలిట దేవేళ్లమని గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం రాజకీయ జిమ్మిక్కులు చేస్తోందని విమర్శించారు. సింగరేణి సొమ్మును.. విశాఖ స్టీల్‌లో పెడితే కార్మికులు ఊరుకోరని హెచ్చరించారు. మరోవైపు, సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగులు తగ్గిపోతున్నారని.. ఆ ఖాళీలను భర్తీ చేయడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని అప్పుల్లోకి నెట్టేరని ధ్వజమెత్తారు.

Kishan Reddy slams kcr

సింగరేణిలో పరిపాలన పతనం, సింగరేణి సిబ్బందిని గణనీయంగా తగ్గించడం , గనులలో భద్రత లోపించడం, అన్ని వ్యవహారాలల్లో రాజకీయ జోక్యం చేసుకోవడం షరా మామూలైపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలొచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మికులు గుర్తుకొస్తారని.. వారి జీవితాలు, జీతాల గురించి ప్రస్తావిస్తారు కానీ మళ్లీ వారిని పట్టించుకోరన్నారు.అసెంబ్లీలో, అసెంబ్లీ బయట 2014,2018,2019 ఎన్నికల్లో సింగరేణి కార్మికులందరికీ కేసీఆర్ సొంత ఇల్లు కట్టిస్తామని హామీ ఇంత వరకు నెరవేరలేదన్నారు. సింగరేణిని దేశమంతా విస్తరిస్తామని .. ఇతర దేశాల్లో కూడా బొగ్గుగనులను లీజ్‌కు తీసుకుంటాం, అంతర్జాతీయంగా సింగరేణిని విస్తరిస్తామని చెప్పిన కేసీఆర్.. తొమ్మిదేళ్లైనా ఆ హామీలు ఎందుకు నెరవేరలేదో సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి సింగరేణి సంస్థలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతోందని కిషన్ రెడ్డి తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని పట్టించుకోవట్లేదన్నారు. 2014 ఏప్రిల్ లో 62 వేల మంది సింగరేణి కార్మికులు పర్మినెంట్ ఉద్యోగులుగా పనిచేస్తుంటే ఆ సంఖ్య ఇపుడు 43 వేలకు పడిపోయిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం20 వేలఉద్యోగులకు కోత విధించిందని వెల్లడించారు. 2014లో 14 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే ఆ సంఖ్య ఇపుడు 30 వేలకుపైగా పెరిగిందన్నారు. 16 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకుని కార్మికుల శ్రమదోపిడి చేస్తుందని విమర్శించారు. కోల్ ఇండియా అప్పులు రోజు రోజుకు తగ్గుతుంటే.. బీఆర్ఎస్ పుణ్యమా అని సింగరేణి అప్పులు భారీగా పెరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+