సర్కార్ మీసం మెలివేస్తే.. అంతకన్నా అన్యాయం మరొకటి లేదు: కోదండరాం
పోలీసులు ర్యాలీని అడ్డుకున్నా.. ర్యాలీ జరిగితే వచ్చేంత ప్రచారం వచ్చిందని, విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని వెల్లడించాయని కోదండరాం అన్నారు.
చెన్నై: తెలంగాణ ఉద్యమంలో సమన్వయంతో కలిసి పనిచేసిన వ్యక్తులు ఇప్పుడిలా ప్రత్యర్థులుగా మారుతారని బహుశా తెలంగాణ జనం ఊహించి ఉండరు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై నిర్ద్వంద్వంగా గళమెత్తుతున్న కోదండరాంపై ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.
మరోవైపు కోదండరాం మాత్రం వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలు పంపిస్తున్నారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని ప్రభుత్వం అణిచేయడంతో జైఏసీ ఛైర్మన్ కోదండరాం ఆగ్రహంగా ఉన్నారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారని, సర్కార్ మీసాలు మెలివేస్తే అంతకన్నా అన్యాయం మరొకటి ఉండదని అన్నారు.

నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనాలకున్న వారిని ఎక్కడికక్కడ నిర్భంధించే ప్రయత్నం చేసినా.. పలు చోట్ల ర్యాలీలు జరిగాయని కోదండరాం తెలిపారు. బుధవారం ఇందిరాపార్కు మొత్తాన్ని దిగ్బంధం చేశారని, ర్యాలీ నిర్వహించాలని భావించిన ఐదువేల మందిని పోలీసులు అరెస్టు చేశారని ఆయన వివరించారు.
హాస్టళ్ల ముందు, వర్సిటీల్లోను పోలీసులను మోహరించారని, అయినా సరే విద్యార్థులు యూనివర్సిటీల్లో ర్యాలీ నిర్వహించగలిగారని తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కూడా నిరసన తెలిపినట్లు స్పష్టం చేశారు. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నా.. ర్యాలీ జరిగితే వచ్చేంత ప్రచారం వచ్చిందని, విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని వెల్లడించాయని కోదండరాం అన్నారు.












Click it and Unblock the Notifications