కేసీఆర్ ప్రభుత్వ వైఖరికి నిరసనంగా ఇంట్లో కోదండరాం దీక్ష
తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ఆచార్య కోదండరాం తార్నాకలోని తన ఇంట్లో మంగళవారం 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు.
Recommended Video

Telangana Art Teachers Protest Against Unemployment | Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ఆచార్య కోదండరాం తార్నాకలోని తన ఇంట్లో మంగళవారం 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం సాగుతున్న ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని మండిపడ్డారు.

జేఏసీపై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరినే ఈ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ, నిర్బంధ వైఖరికి నిరసనగా దీక్షను చేపట్టానన్నారు.
కొలువులకై కొట్లాట సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించిన దీక్షను బుధవారం మూడు గంటలకు ముగిస్తారు.












Click it and Unblock the Notifications