వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కేం సంబంధం!: ఏపీ ప్రభుత్వంపై కోదండ ఫైర్, సండ్ర నోటీసుపై ఏసీబీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఆంధ్రా పోలీసులను మోహరించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దురహంకారానికి నిదర్శనమని తెలంగాణ రాజకీయ ఐక్య కారగ్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శుక్రవారం మండిపడ్డారు.

ఏసీ సర్కార్ అహంకారంతో ప్రవర్తిస్తోందన్నారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అవసరమే లేదని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో ఉన్నవారు కోర్టులో తేల్చుకోవాలని, ఈ వ్యవహారం ప్రభుత్వానికి సంబంధం లేని విషయమన్నారు.

సండ్ర లేఖ అందలేదన్న ఏసీబీ

Kodandaram lashes out at AP government, supports KCR

ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సాయంత్ర ఐదు గంటల వరకు విచారణకు హాజరు కావాలని సండ్రకు ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ సమయం వరకు కూడా సండ్ర ఏసీబీ ఎదుట హాజరు కాలేదు. తనకు ఆరోగ్య సహకరించడం లేదని విచారణకు హాజరు కాలేకపోతున్నానని సండ్ర ఏసీబీకి లేఖ రాశారు. అయితే సండ్ర లేఖ తమకు ఇంకా అందలేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

English summary
Kodandaram lashes out at AP government, supports KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X