కేసీఆర్ సర్కార్‌కు కోదండరాం ప్రశ్న: నిధులు తగ్గాయా? దారి మళ్లుతున్నాయా?
హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొ.కోదండరాం. రాష్ట్ర స్థితిగతులపై వెంటనే ఓ శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రైవేటీకరణ, కేటాయిస్తోన్న నిధుల్లో అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేశారు కోదండరాం.
తెలంగాణ జేఏసీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు నాంపల్లిలోని టీజేఏసీ కార్యాలయంలో నిర్వహించిన భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు కోదండరాం. విద్య, వైద్యం, జేఏసీ కమిటీలపై నిర్మాణంపై సమావేశంలో ప్రధానంగా చర్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సందర్బంగా.. సర్కార్ పై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారాయన.

తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఫీజు రియింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందంటూ కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో నిధుల చెల్లింపులపై అనుమానం లేవనెత్తిన ఆయన.. నిధులు తగ్గాయా? లేక దారి మళ్లుతున్నాయా? అన్న సందేహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సరైన వైద్య సేవలు అందక పేద ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు కోదండరాం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చిందని.. ఇప్పటికీ 2140 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. ఉన్నత విద్యారంగంలో పేద విద్యార్థులు ప్రవేశించడం కష్టంగా మారిపోయిందని, ప్రస్తుతం 90 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లోనే చదువుతున్నారని కోదండరాం వివరించారు.












Click it and Unblock the Notifications