4గురికి చెప్తా కానీ చెప్పించుకోను: దాడి జరిగినా.. కేసీఆర్‌పై యుద్ధనికే కోదండ

హైదరాబాద్: తాను నలుగురికి చెప్పేవాడినే కానీ, ఇతరులతో చెప్పించుకునే వాడిని కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం నాడు అన్నారు. జేఏసీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానితో పోరాటానికే ఆయన సై అన్నారు.

ఆయన మాట్లాడుతూ... ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాము ప్రజల పక్షాననే నిలబడతామని చెప్పారు. తమ పైన దాడులు జరిగినా ప్రజల కోసం పోరాడుతామని చెప్పారు. సమావేశంలో పలువురు చాలా సూచనలు చేశారని, కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్పారు.

మల్లన్న సాగర్ బాధితులకు అండగా నిలబడతామని చెప్పారు. త్వరలో గజ్వెల్‌లో సెమినార్ ఉంటుందని తెలిపారు. యూనివర్సిటీలకు ఇప్పటి వరకు వీసీలను నియమించలేదన్నారు. వర్సిటీల సమస్యల పైన ఓయులో త్వరలో సెమినార్ ఉంటుందని చెప్పారు.

వాళ్లకు, మీకు తేడా ఏంటి: కేసీఆర్‌పై కోదండ సంచలనం, మహిళలు కాళ్లుమొక్కి, ఏడ్చారు

ప్రయివేటు కాలేజీల పైన దాడులు ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల పైన డీపీఆర్‌ను ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు. డీపీఆర్ ఫైనల్ అయ్యాకే కాంట్రాక్టులు ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు జీతాలు పెంచినట్లుగా ప్రజలకు బతుకుదెరువు చూపించాలన్నారు.

Kodandaram ready to fight with KCR for Telangana people

ఓపెన్ కాస్ట్ సరికాదన్నారు. అవసరమైతే ఓపెన్ కాస్ట్ పైన గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తామన్నారు. తాను రెండుసార్లు అపాయింటుమెంట్ అడిగినా కేసీఆర్ ఇవ్వలేదని చెప్పారు. తమ వెనుక ఎవరూ లేరని, తాము ప్రజల పక్షం వహిస్తామని చెప్పారు.

హైకోర్టు విభ‌జ‌నపై న్యాయ‌వాదులు పోరాటం చేస్తున్నారని, న్యాయ‌మూర్తులు న్యాయం కోసం పోరాడడం విచిత్రమ‌ని వ్యాఖ్యానించారు. తాము న్యాయ‌వాదుల‌ ఆందోళ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తునిస్తున్నట్లు చెప్పారు. తెరాస ప్ర‌భుత్వం తామిచ్చిన‌ మేనిఫెస్టోలోని అంశాల‌న్నీ అమ‌లు చేయాలన్నారు.

తెలంగాణ‌లో కొన‌సాగుతోన్న భూసేక‌ర‌ణ విధానం స‌రికాద‌న్నారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ భూ నిర్వాసితుల కోసం స‌ద‌స్సు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఓపెన్ కాస్ట్ గ‌నుల‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌తామ‌న్నారు. తనపై టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలపై ఆయన స్పందించలేదు. తాను న‌లుగురికీ చెప్పే వాడిని కానీ చెప్పించుకునే వాడిని కాదని మాత్రం చెప్పారు.

తెలంగాణ‌లో మూతప‌డిన కంపెనీల పున‌రుద్ధ‌ర‌ణ కోసం శ్ర‌మిస్తామ‌న్నారు. చ‌క్కెర ప‌రిశ్ర‌మ‌ల పున‌రుద్ధ‌ర‌ణ కోసం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాలన్నారు. టీజేఏసీని మ‌రింత‌ బలోపేతం చేస్తామ‌న్నారు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా ముందుకెళ‌తామ‌న్నారు. ప్రజల శ్రేయ‌స్సు కోసం త‌మ‌ ప్ర‌య‌త్నం కొన‌సాగుతుందని అన్నారు.

ప్రజలే తమకు ముఖ్యమన్నారు. వారి కోసం పోరాడతామన్నారు. క‌రవుకు సంబంధించిన మాన్యువ‌ల్‌లో స‌వ‌ర‌ణ రావాలన్నారు. తెలంగాణ‌లో విద్యారంగంలో చాలా స‌మ‌స్య‌లున్నాయన్నారు. యూనివ‌ర్సిటీల‌కు వీసీలు లేరు టీచింగ్ స్టాఫ్ లేదన్నారు. త‌మ‌పై దాడులు జ‌రిగినా ముందుకెళ‌తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. పాఠ‌శాలలు బ‌ల‌పేతం కావాల‌ని, ఉచిత విద్య అమ‌లు కావాలని ఆయ‌న అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+