టీఆర్ఎస్ అంచనాలు రివర్స్: ఎదురులేని రేవంత్, ఇక కాపాడుకోవాలి

Posted By:
Subscribe to Oneindia Telugu
TRS అంచనాలు రివర్స్: ఎదురులేని రేవంత్

కొడంగల్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌తో పాటు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వద్దకు వెళ్లిన వారిలో ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు ఒకరిద్దరే ఉన్నారు.

అందుకే టీడీపీని వదిలేశా: మోడీని లాగిన రేవంత్, సోనియాను ఆకాశానికెత్తారు

చారకొండ వెంకటేష్‌, సతీష్‌ మాదిగల పేర్లు ఉన్నాయి. ఈ నెలలో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారని, ఆ సమయంలో మిగతా సభ్యులు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.

రేవంత్ భారీ స్కెచ్, కేసీఆర్‌కు తొలిదెబ్బ, టీఆర్ఎస్ ఆందోళన!: టచ్‌లో నాయకులు

ఇప్పటికే టీఆర్ఎస్ అంచనాలు అంతా తారుమారు అవుతున్నాయి. రేవంత్ చేరిక వరకు కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జి లేదా చెప్పుకోదగ్గ నాయకుడు లేరు. ఇప్పుడు రేవంత్ అది భర్తీ చేశారు. మరోవైపు సీతక్క వంటి నాయకులు కొందరు టీఆర్ఎస్ వైపు వెళ్తారనుకుంటే అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరారు.

కేడర్‌ను కాపాడుకునేందుకు టీడీపీ, టీఆర్ఎస్ యత్నం

కేడర్‌ను కాపాడుకునేందుకు టీడీపీ, టీఆర్ఎస్ యత్నం

ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్, టీడీపీ ముఖ్య నేతలు రేవంత్ వెంట వెళ్లకుండా తమ తమ కార్యకర్తలను కాపాడుకోవడంపై ఇతరులు దృష్టి సారించారు. ఈ మేరకు నియోజకవర్గంలో మంగళవారం టీడీపీ, టీఆర్ఎస్ ముఖ్య నేతలు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

 ఢిల్లీ నుంచి వచ్చాక రేవంత్‌తో వెళ్లే వారిపై స్పష్టత

ఢిల్లీ నుంచి వచ్చాక రేవంత్‌తో వెళ్లే వారిపై స్పష్టత

రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎంతమంది ఆయన వెంట నడుస్తారన్న దానిపై ఓ స్పష్టత వస్తుంది. రేవంత్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన లేఖను స్పీకరుకు కాకుండా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు పంపించారు. ఇంతవరకు ఆ లేఖ శాసనసభ స్పీకరుకు చేరలేదు. దీంతో అసలు ఉప ఎన్నిక ఉంటుందో లేదో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

 మరో నంద్యాల ఉప ఎన్నిక

మరో నంద్యాల ఉప ఎన్నిక

గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన సీనియర్‌ నేత గుర్నాథరెడ్డి ఉప ఎన్నిక జరిగితే తన కుమారుడికి టికెటు ఇవ్వాలని సోమవారం టీఆర్ఎస్ అదిష్ఠానాన్ని కోరారు. ఈయన మరో అడుగు ముందుకు వేసి ఈసారి కొడంగల్‌ ఎన్నిక మరో నంద్యాల ఉపఎన్నికగా మారుతుందన్నారు. ఉపఎన్నిక అంశం చర్చానీయాంశమవుతున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుకు వ్యూహరచన బాధ్యతను సీఎం కేసీఆర్‌ అప్పగించారు.

 అదే నిదర్శనం

అదే నిదర్శనం

ఎలాగైనా కొడంగల్‌లో టీఆర్ఎస్ పాగా వేయాలని చూస్తోంది. రేవంత్ కూడా తాను కొడంగల్‌ నుంచే మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, కొందరు రాజకీయ విశ్లేషకులు అసలు ఉప ఎన్నిక జరిగే అవకాశాలు లేవని, రేవంత్ తన రాజీనామాను స్పీకరుకు సమర్పించకుండా చంద్రబాబుకు పంపడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

స్వాగతిస్తున్న కొడంగల్

స్వాగతిస్తున్న కొడంగల్

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిణామాలను కొడంగల్ ప్రజలు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా గమనించారు. తాము రేవంత్ వెంటే ఉంటామని కొడంగల్‌లో మెజార్టీ నాయకులు చెబుతున్నారు. కొందరు మాత్రం పార్టీలోనే ఉంటామని చెబుతున్నారు.

 ఇప్పటి దాకా రేవంత్‌దే హవా

ఇప్పటి దాకా రేవంత్‌దే హవా

నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కానీ లేకపోవడంతో రేవంత్ రాకను మెజార్టీ కాంగ్రెస్ స్వాగతిస్తోంది. కొన్నాళ్లుగా కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. దీంతో రేవంత్‌దే హవాగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. మరోవైపు టీఆర్ఎస్ గుర్నాథ్ రెడ్డి ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో గత రెండు ఎన్నికల్లో రేవంత్ హవాకు ఎదురులేకుండా పోయింది. మాస్ లీడర్ తమ పార్టీలో చేరారని కాంగ్రెస్ నేతలు ఆనందిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kodangal Congress party is very happy with MLA Revanth Reddy joining in Congress party in the presence of AICC vice president Rahul Gandhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి