ఏంచేశాడు: రేవంత్ రెడ్డికి 'కొడంగల్' షాక్, చేరికపై హడావుడి ఎందుకు: సీఎల్పీలో నిలదీత

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/కొడంగల్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లలో మరో షాక్ తగిలింది. కొడంగల్‌లో ఇప్పటి వరకు ఆయనను అంటిపెట్టుకొని ఉన్న నేతలు ఆయనకు ఝలక్ ఇస్తున్నారు.

చదవండి: ఇమేజ్ డ్యామేజ్, ఎదురుగాలి: రేవంత్‌కు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్, రాంగ్‌స్టెప్?

ఇటీవల పలువురు నేతలు తెరాసలోకి

ఇటీవల పలువురు నేతలు తెరాసలోకి

నాలుగు రోజుల క్రితం కొందరు నేతలు అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా, మంగళవారం మరికొందరు టిడిపి నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి మహేందర్ రెడ్డిల సమక్షంలో పలువురు నేతలు హైదరాబాదులో తెరాసలో చేరారు. టిడిపి నాయకులతో పాటు కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా తెరాసలో చేరారు.

అసలు రేవంత్ రెడ్డి చేసిందేమిటి?

అసలు రేవంత్ రెడ్డి చేసిందేమిటి?

కొడంగల్, దౌల్తాబాద్‌లకు చెందిన టిడిపి ప్రజాప్రతినిధులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి కొడంగల్‌కు చేసిందేమిటని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. టిడిపి నుంచి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు.

సిఎల్పీ సమావేశంలో రేవంత్ అంశంపై చర్చ

సిఎల్పీ సమావేశంలో రేవంత్ అంశంపై చర్చ

మరోవైపు, మంగళవారం హైదరాబాదులో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి అంశంపై చర్చ జరిగింది. కొందరు నేతలు, సీనియర్ల మధ్య ఘాటుగా చర్చ జరిగిందని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి చేరికపై అంత హడావుడి అవసరమా?

రేవంత్ రెడ్డి చేరికపై అంత హడావుడి అవసరమా?

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొడంగల్‌లో చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సీఎల్పీ భేటీలో ప్రస్తావించారు. రేవంత్ చేరికపై అంత హడావుడి అవసరమా అని నిలదీశారు. అయితే ఆయన చేరిక అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని సీనియర్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kodangal TDP leaders join TRS, Revanth Reddy issue in CLP meeting

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి