పనుల కోసమే: కోమటిరెడ్డి, టీఆర్ఎస్‌లోకి గుత్తా సోదరుడు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి సోదరులు (కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి)లు శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సోదరులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

కేసీఆర్‌తో భేటీ అనంతరం వారు మాట్లాడారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. కొత్త ప్రాజెక్టులు ప్రకటించటం బాగానే ఉందని కానీ, పాత ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు.

Komatireddy brothers new twist in Revanth Reddy episode

తెరాస ఉద్యమ పార్టీ కనుకే ప్రజలు ఆ పార్టీకి ఓటు వేశారని చెప్పారు. వచ్చే సర్కారు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు.

తమ పార్టీకి చెందిన కొందరు నేతలు తెరాసలో చేరడంపై వారు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరు పోతే వందమంది తయారవుతారన్నారు. తమకు పనులు అవుతాయనే కొందరు అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శించారు.

తెరాసలో చేరిన గుత్తా సోదరుడు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు జితేందర్ రెడ్డి శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. జితేందర్ రెడ్డి మదర్ డెయిరీ చైర్మన్‌గా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+