నేడే చివరి రోజు - కోమటిరెడ్డి సంచలన నిర్ణయం..!!

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత కాలంగా తనకు మంత్రి పదవి రాకపోవటం పైన వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల పై పార్టీ హైకమాండ్ ఆరా తీసింది. ఇక, ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తన అనుచర గణంతో గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించిన కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేసారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రివర్గ విస్తరణ లో తనకు అవకాశం రాకపోవటం పైన రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంది ఎవరని ప్రశ్నిస్తున్నారు. తన అన్నకు మంత్రి పదవి ఇస్తే.. తనకు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీస్తున్నారు.

Komatireddy Rajagopal Reddy sensational decision amid Assembly Sessions

ముఖ్యమంత్రి రేవంత్ పైన పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. ఇక, ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గన్ పార్క్ వద్ద కీలక వ్యాఖ్యలు చేసారు. వరదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ అసెంబ్లీకి రావడం ఇష్టం లేదని చెప్పారు. ఈ రోజు(శనివారం) మాత్రమే అసెంబ్లీకి వస్తానని వెల్లడించారు.రేపు (ఆదివారం) నుంచి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని రాజ్‌గోపాల్ రెడ్డి చెప్పారు.

ఇదే సమయంలో అసెంబ్లీకి తన హాజరయ్యేది ఇదే చివరి రోజు అని చెప్పటం ద్వారా రాజగోపాల్ రెడ్డి ఆలోచన ఏంటనేది ఆసక్తి కరంగా మారింది. తాను మెదక్, కామారెడ్డి వరద బాధితులకు అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. ఇక నుంచి ప్రజల్లోనే ఉంటానని రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని.. బాధల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి వారికి అండగా ఉంటానని వెల్లడించారు.

అయితే, ఈ సమావేశాల వరకు రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీకి దూరంగా ఉంటారా.. లేక ఇక పూర్తిగా దూరం అవుతారా అనేది ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చగా మారుతోంది. రాజగోపాల్ రెడ్డి నిర్ణయం ఏంటనేది పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. అయితే, రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో తన కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+