నియంతలా: 48 గంటల దీక్ష ప్రారంభించిన కోమటిరెడ్డి, సంపత్
Recommended Video

కేసీఆర్ పై కాంగ్రెస్ తిరుగుబాటు మొదలు
హైదరాబాద్: మండలి చైర్మన్ స్వామిగౌడ్ పైన అసెంబ్లీలో దాడి చేశారనే ఆరోపణలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసన సభ్యత్వాలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరు గాంధీ భవన్‌లో దీక్షకి దిగారు.
సాయంత్రం కోమటిరెడ్డి, సంపత్‌లు 48 గంటల తమ దీక్షను ప్రారంభించారు. దీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గాంధీ భవన్ ఎదుట కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాము దీక్ష ప్రారంభించామని కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌లు వెల్లడించారు. ఇద్దరి శాసన సభ్యత్వాలు రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications