కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు కాళ్లపైనా-పీసీసీకి కనిపించదా : రేవంత్ తో పోలికా-కోమటిరెడ్డి కలకలం..!!

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి అన్నట్లుగా రాజకీయం మారుతోంది. తాజాగా వైఎస్ విజయమ్మ నిర్వహించిన వైఎస్సార్ ఆత్మీయ సదస్సుకు ఎంపీ కోమటిరెడ్డి హాజరయ్యారు. టీపీసీసీ కాంగ్రెస్ నేతలెవ్వరూ ఆ సమావేశానికి వెళ్లవద్దని ఆదేశించింది. అయితే, దీని పైన కోమటిరెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. అదే సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. విజయమ్మ తనకు ఆహ్వానం పంపి..హాజరు కావాల్సిందిగా కోరటంతో తాను హాజరయ్యానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

 విజయమ్మ సమావేశానికి హాజరుపై..

విజయమ్మ సమావేశానికి హాజరుపై..

తనకు మూడు రోజుల క్రితమే ఆహ్వానం వచ్చిందన్నారు. సమావేశానికి రెండు గంటల ముందు పీసీసీ నిర్ణయం తీసుకుంటే తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ మరణించారని..ఆయన కాంగ్రెస్ మనిషని చెప్పిన కోమటిరెడ్డి అటువంటి వ్యక్తి 12వ వర్దంతి కి పిలిస్తే వెళ్లదని చెప్పటం ఏంటని నిలదీసారు. ఖచ్చితంగా హాజరు కావాలని స్పష్టం చేసారు. దీని పైన తాను ఢిల్లీలోనూ మాట్లాడుతానంటూ తేల్చి చెప్పారు. తాను జగన్ లేదా షర్మిల పెట్టిన సమావేశాలకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు.

 చంద్రబాబుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పాదాభివందనాలా..

చంద్రబాబుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పాదాభివందనాలా..

వైఎస్సార్ ను కాంగ్రెస్ ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో కాంగ్రెస్ కు ఓట్లు పెరుగుతాయని కోమటిరెడ్డి విశ్లేషించారు. ఇదే సమయంలో మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి చంద్రబాబుకు రాఖీలు కట్టి..పాదాభివందనం చేస్తే పీసీసీకి కనిపించటం లేదా అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉంటూ టీడీపీ నేతలకు పాదాభివందనం చేస్తే ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నిర్ణయం ధిక్కరిస్తున్నారా అనగా..తనది రేవంత్ రెడ్డి లెవల్ లో తాను మాట్లాడనని చెప్పుకొచ్చారు.

 ఇదేమన్నా ఆయన సొంత పార్టీనా...

ఇదేమన్నా ఆయన సొంత పార్టీనా...

ఇదేమన్నా సొంత పార్టీనా..డిక్టేటర్ షిప్ గా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ నేతల వద్దకు వెళ్తుంటే పీసీసీ నిద్రపోతుందా అంటూ కోమటిరెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ల సొంతమా...ఈ పార్టీ అందరిదీ అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ అమెరికాలో కూడా లేదని ..ఒబామా కేర్ సైతం దీని నుంచే వచ్చిందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన సమావేశమని..తాను వస్తానని మాట ఇచ్చానని..అందుకే వచ్చానని కోమటిరెడ్డి వివరించారు.

Recommended Video

    పాఠశాలల ప్రారంభంపై సబిత ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకురాళ్లు
     కాంగ్రెస్ లో తప్పుడు నిర్ణయాలు వద్దు..

    కాంగ్రెస్ లో తప్పుడు నిర్ణయాలు వద్దు..

    ఇందులో ఎటువంటి రాజకీయ అజెండా లేదని కోమటిరెడ్డి స్పష్టం చేసారు. ఎంతో మంది ఎంపీలు-ఎమ్మెల్యేలను ఆయన తయారు చేసిన వారేనని చెప్పారు. కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ కార్యక్రమానికి వెళ్లవద్దని చెప్పటం వైఎస్ ను అవమానించటమే అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో తప్పుడు నిర్ణయాలు వద్దని కోమటిరెడ్డి సూచించారు. తానే కాదని..కాంగ్రెస్ నేతలంగా ఈ సమావేశానికి హాజరు అయ్యి ఉంటే బాగుండేదని వివరించారు. వైఎస్సార్ చేసిన పధకాలను ప్రస్తావించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+