వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్-కేటీఆర్‌లను పొగుడుతారా, మేం గెలిస్తే: కోమటిరెడ్డి ఆగ్రహం

గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును పొగడటం ఏమాత్రం బాగా లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం నాడు అన్నారు.

|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును పొగడటం ఏమాత్రం బాగా లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం నాడు అన్నారు.

తాము 2019లో అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీనీ స్వాధీనం చేసుకొని నడిపిస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ ఏమాత్రం అమలు చేయడం లేదని మండిపడ్డారు.

'రాజకీయ కక్ష, చిరుకు అవమానం': 150వ సినిమాకు బాబు అనుమతివ్వడం లేదా?'రాజకీయ కక్ష, చిరుకు అవమానం': 150వ సినిమాకు బాబు అనుమతివ్వడం లేదా?

గవర్నర్ తన హోదాను మరిచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను పొగడటం భావ్యంగా లేదని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిజాం చక్కెర కర్మాగారాలును ప్రభుత్వమే నడిపిస్దుందని కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మాట తప్పారన్నారు.

 Komatireddy unhappy with governor comments on CM KCR

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని నడిపిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామని, నోట్ల రద్దు తర్వాత తలెత్తిన పరిణామాలపై యూత్ కాంగ్రెస్ ప్రత్యేక కార్యక్రామాలు చేపడుతున్నామన్నారు.

గ్రామాల వారీగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 16వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రచ్చబండ అనంతరం ప్రజా సమస్యలపై బీజేపీ ప్రతినిధులకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.

18, 19 తేదీల్లో గవర్నర్, కలెక్టర్లకు వినతిపత్రాలు, 20, 21 తేదీల్లో ప్రజల నుంచి సంతకాల సేకరణ, 21 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, 28న జాతీయ స్థాయిలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కాగా, కేసీఆర్‌పై గవర్నర్ నరసింహన్ చేసిన వ్యాఖ్యలపట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

English summary
Komatireddy unhappy with governor comments on CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X