కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టింది.. సచివాలయం కూల్చితే ఊరుకునేది లేదు : కోమటిరెడ్డి
హైదరాబాద్ : పాత భవనాలను కూల్చివేసి ఇప్పుడున్న చోటే కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ కు వాస్తు పిచ్చి పట్టిందని విమర్శించారు.

చారిత్రక భవనాలను, సచివాలయ భవనాలను కూల్చివేయడం సొంత వ్యవహారం కిందకు రాదన్న సంగతి కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. వాస్తు సరిగా లేకపోతే లం సంజీవరెడ్డి రాష్ట్రపతి, పీవీ నర్శింహారావు ప్రధాని ఎలా కాగలిగారని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా.. సచివాలయాన్ని కూల్చివేసేందుకు సిద్దమైతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, అవసరమైతే హైకోర్టు దాకా వెళ్లి పిల్ దాఖలు చేస్తామని తెలిపారు కోమటిరెడ్డి.












Click it and Unblock the Notifications