కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వనున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర మనస్తాపంతో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని వీడటం కోసం రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

గతంలో తెలంగాణ పిసిసి చీఫ్, ఏఐసిసి పదవులు ఆశించిన ఆయన తనకు పదవులు లభించకపోవడంతో భంగపడ్డారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి బాహాటంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వటంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అప్పుడే ఆయన పార్టీ మారతారని ప్రచారం అరిగ్గింది. దీంతో పాటు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్న సమయంలో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Komatireddy Venkat Reddy will give a huge shock to the Congress party?

తమ్ముడిని గెలిపించటం కోసం పని చేస్తున్నారని ఆయన కాంగ్రెస్ శ్రేణుల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఆయన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆయన తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. అయినప్పటికీ తమ్ముడు ఎఫెక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై తీవ్రంగా పడింది. కాంగ్రెస్ పార్టీ నేతలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరం మరింత పెరిగింది.

దీంతో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇక నేడు ఆయన ఫైనల్ డెసిషన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని, మరికాసేపట్లో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+