వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక తో కోమటిరెడ్డి భేటీ : టార్గెట్ రేవంత్ - ఫైనల్ డెసిషన్..!!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ప్రియాంక గాంధీ కార్యాలయం నుంచి వెంటనే ఢిల్లీ రావాలని సూచించారు. ప్రియాంక గాంధీతో వెంకటరెడ్డి సమావేశం కానున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో టీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక సమావేశమయ్యారు. ఒన్ టు ఒన్ అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్రంలో పరిస్థితుల పైన ఆరా తీసారు. అదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక గురించి దిశా నిర్దేశం చేసారు. ఆ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు. అదే సమయంలో పార్టీ అధినేత్రి సోనియాకు వెంకటరెడ్డి లేఖ రాసారు.

వెంకటరెడ్డితో భగేల్ భేటీ

వెంకటరెడ్డితో భగేల్ భేటీ


టీపీసీసీ చీఫ్ రేవంత్ పైన ఫిర్యాదు చేసారు. హైదరాబాద్ తిరిగి వచ్చేసిన వెంకటరెడ్డి పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. నాటకాలు అడుతున్నారంటూ మండిపడ్డారు. తాను మునుగోడు ప్రచారానికి వెళ్లనని.. పదవుల్లో ఉన్న వారే పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక, ఈ రోజున మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మాణికం ఠాగూర్ గాంధీ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మంగళవారం రాత్రి ఏఐసీసీ నేత రాజ భగేల్ వెంకటరెడ్డితో భేటీ అయ్యారు.

టెన జన్ పథ్ లో సమావేశం

టెన జన్ పథ్ లో సమావేశం


సోనియా కార్యాలయంతో మాట్లాడించారు. ఈ రోజు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించారు. దీంతో..ఢిల్లీ వెళ్లిన ఈ మధ్నాహ్నం ఢిల్లీలో ప్రియాంక గాంధీతో వెంకటరెడ్డి సమావేశం కానున్నారు. నేరుగా రేవంత్ పైన ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మాణికం ఠాగూర్ వ్యవహార శైలి.. సీనియర్ల ఆవేదన గురించి వెంకటరెడ్డి మాట్లాడేందుకు సిద్దమయ్యారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. తన పైన మనుగోడు సభలో దయాకర్ చేసిన వ్యాఖ్యల పైన ఫిర్యాదు చేయనున్నారు.

ప్రచారానికి వెళ్తారా.. ఏం చెప్పబోతున్నారు

ప్రచారానికి వెళ్తారా.. ఏం చెప్పబోతున్నారు


ఇక, మునుగోడులో ప్రచారానికి వెళ్లనని చెప్పిన వెంకటరెడ్డికి..పార్టీ అధినాయకత్వం క్యాంపెయిన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దీనికి వెంకటరెడ్డి అక్కడ ఏం చెబుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. తన సోదరుడికి వ్యతిరేకంగా వెంకటరెడ్డి మునుగోడులో ప్రచారం చేస్తే..రాజకీయంగా మరింత ఆసక్తి కరంగా మారనుంది. అదే సమంయలో రేవంత్ - ఠాకూర్ పైన చేసే ఫిర్యాదులకు ఎటువంటి స్పందన ఉంటుందనేది చూడాలి. మొత్తంగా.. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు రేవంత్ వర్సస్ కోమటిరెడ్డి అన్నట్లుగా మారిన పరిస్థితుల నేపథ్యంలో టెన్ జన్ పథ్ లో జరిగే ఈ సమావేశం కీలకంగా మారుతోంది.

English summary
Komatireddy Venkata Reddy to meet Priyank Gandhi in Delhi today, Venkata Reddy received call from her office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X