రేవంత్ రెడ్డికి జై కొట్టటం వెనుక కొండా దంపతుల రాజకీయ వ్యూహం .. ఫైర్ బ్రాండ్ సురేఖ పక్కా పొలిటికల్ ప్లాన్ !!

ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలను శాసించిన కొండా దంపతులు మరోమారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో ఒక వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నా కొండా సురేఖ రేవంత్ రెడ్డి వెంటే తాను అని సంకేతాలు ఇవ్వడం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయా? తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా, కేసీఆర్ పై, కేటీఆర్ పై, ఎంపీ సంతోష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి టిఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కొండా సురేఖ మళ్లీ వరంగల్ జిల్లా రాజకీయాలలో ముందువరుసలో నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ

కొండా సురేఖ.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకురాలు. ఏదైనా ముక్కు సూటిగా చెప్పే స్వభావం ఉన్న నాయకురాలు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెలుగు వెలిగిన కొండా సురేఖ వైయస్ఆర్ సర్కార్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రిగానూ పని చేశారు. ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాల మధ్య జగన్ కు జై కొట్టి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదని గుర్తించిన కొండా సురేఖ తిరిగి టిఆర్ఎస్ పార్టీలో చేరి కెసిఆర్ నాయకత్వంలో పని చేయాలని ప్రయత్నించారు.

టీపీసీసీ చీఫ్ రేసులో సురేఖ .. కేసీఆర్ పై రివెంజ్ కోసం ఎదురుచూపు

టీపీసీసీ చీఫ్ రేసులో సురేఖ .. కేసీఆర్ పై రివెంజ్ కోసం ఎదురుచూపు

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే గా టిఆర్ఎస్ పార్టీలో నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ఎదుర్కొన్న కొండా సురేఖ, ఆ తర్వాత తనను పొమ్మనకుండా పొగ పెట్టిన కెసిఆర్ కు చాలెంజ్ విసిరి మరీ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరిగి సొంత గూటికి కాంగ్రెస్ పార్టీకి చేరుకున్న కొండా సురేఖ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోతున్న నేపథ్యంలో, గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి ఓటమి పాలు కావడంతో తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదాన్ని గుర్తించి పార్టీలో కీలక పదవి కోసం శతవిధాల ప్రయత్నించారు. బీసీ మహిళ నాయకురాలిగా టీపీసీసీ చీఫ్ పదవికి సురేఖ కూడా రేసులో ఉన్నట్టు ఆమె పేరును సైతం అధిష్టానం పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.

మంగళహారతి ఇచ్చి మరీ రేవంత్ కు స్వాగతం .. కొండా దంపతుల రాజకీయ వ్యూహం

మంగళహారతి ఇచ్చి మరీ రేవంత్ కు స్వాగతం .. కొండా దంపతుల రాజకీయ వ్యూహం

అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి గా రేవంత్ రెడ్డి నియామకం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి నియామకంపై కాస్త అసంతృప్తితో ఉన్నప్పటికీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి తో కలిసి ముందుకు సాగటం అనివార్యమని భావించారు కొండా సురేఖ. కెసిఆర్ పై పోరాటం చేయాలన్నా, స్థానికంగా రాజకీయాల్లో తమ పట్టు నిలుపుకోవాలన్నా రేవంత్ కు మద్దతు ఇవ్వడం,రేవంత్ కు అండగా నిలబడడం తమకు అవసరమని గుర్తించారు. ఈ క్రమంలోనే మంగళహారతి ఇచ్చి మరీ రేవంత్ రెడ్డిని స్వాగతించారు కొండా సురేఖ.

అనేక పరిణామాలతో రాజకీయంగా వెనుకబడిన కొండా దంపతులు

అనేక పరిణామాలతో రాజకీయంగా వెనుకబడిన కొండా దంపతులు

గతంలో రేవంత్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక వర్గానికి ఆగ్రహం తెప్పించినప్పటికీ, తాజాగా ఆమె రేవంత్ రెడ్డిని స్వాగతించడం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ లో రాళ్ల దాడి, రాష్ట్ర విభజన తర్వాత పార్టీలు మారడం, గత ఎన్నికలలో ఓటమి పాలు కావడం వంటి అనేక పరిణామాలు కొద్దికొద్దిగా కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తును ఆందోళనలో పడేశాయి.

 రేవంత్ లీడర్ షిప్ పై నమ్మకం .. అందుకే ఫైర్ బ్రాండ్ సురేఖ కూడా రెడీ

రేవంత్ లీడర్ షిప్ పై నమ్మకం .. అందుకే ఫైర్ బ్రాండ్ సురేఖ కూడా రెడీ

ఇప్పుడు కెసిఆర్ పై ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ రెడ్డి గట్టిగానే యుద్ధం చేస్తాడు అని భావిస్తున్న కొండా సురేఖ, తాను సైతం రేవంత్ కు బాసటగా నిలిస్తే కెసిఆర్ పై పోరాటం సక్సెస్ అవుతుందని, జిల్లా రాజకీయాలలోనూ తాము కీలకంగా మారే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలతో, కెసిఆర్ ని ఎదుర్కొనే ఉద్దేశంతో కొండా సురేఖ రేవంత్ కు జై కొట్టారు. మరి ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ కలిసి ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీలో ఒక నూతనోత్తేజం వస్తుందని, జిల్లా రాజకీయాల్లోనూ సురేఖ కీలకంగా మారే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+