Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొండా మురళిపై చర్యలు తీసుకోకుంటే అలా చెయ్యండి.. వరంగల్ కాంగ్రెస్ నేతల కొత్తమెలిక!

కొండ మురళి వర్సెస్ వరంగల్ లీడర్స్ వార్ కొనసాగుతోంది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పైన, మంత్రి కొండా సురేఖ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం దగ్గర పట్టుబడుతున్నారు. ఈరోజు గాంధీభవన్ కు చేరుకున్న వారు కొండా మురళి పైన చర్యలు తీసుకోవాల్సిందేనని క్రమశిక్షణ కమిటీకి తేల్చి చెప్పారు.

కొండా దంపతుల విషయంలో క్రమశిక్షణ కమిటీని నిలదీసిన వరంగల్ లీడర్స్
తాము లోకల్ గా తలెత్తుకొని తిరగలేక పోతున్నామని, తిట్లు తిన్నది అవమానపడింది తామని, కానీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోకుండా తమను పిలవడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రావటం తమకు అవమానంగా ఉందన్నారు. క్రమశిక్షణ కమిటీ ఎటువంటి సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు.

konda murali vs warangal congress leaders shocking twist before congress disciplinary committee

Take a Poll

మల్లు రవి ముందు కుండ బద్దలు కొట్టిన వరంగల్ కాంగ్రెస్ నేతలు
ఈరోజు గాంధీభవన్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి తదితరులు కాంగ్రెస్ అధిష్టానం ముందు తమ బలమైన వాదనను వినిపించారు. కచ్చితంగా కొండా మురళి పైన చర్యలు తీసుకోవాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కి తాము చెప్పదలుచుకున్న విషయాలను తేల్చి చెప్పారు.

కొండా మురళి పైన చర్యలు సాధ్యపడకుంటే అలా చెయ్యాలని మెలిక
ఒకవేళ కొండా మురళి పైన చర్యలు తీసుకోవడం సాధ్యం కాకపోతే, తమకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని తమకు నచ్చినట్టు తాము పని చేస్తామని, తాము కూడా మాట్లాడదలుచుకుంది మాట్లాడుతామని వాళ్ళు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానానికి తాము ముఖ్యమో కొండా ఫ్యామిలీ ముఖ్యమో తేల్చుకోవాలి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోమారు అల్టిమేటం జారీ చేశారు.

కొండా వర్సెస్ లోకల్ లీడర్స్ పంచాయితీపై మల్లు రవి చెప్పిందిదే
క్రమశిక్షణా కమిటీ సమావేశం అనంతరం ఈ వ్యవహారం పైన క్రమశిక్షణ కమిటీ సమావేశం పైన మల్లు రవి మాట్లాడారు . వరంగల్ నేతల పంచాయతీ పైన చర్చించామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చెప్పారని ఆయన పేర్కొన్నారు. మరోమారు వరంగల్ నేతలతో భేటీ అవుతామని ఆయన స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+