పొలిటికల్ ఫ్యూచర్‌పై కొండా సురేఖ దంపతుల మౌనం – అప్పటివరకు అజ్ఞాతం!
ఇటీవల మంత్రిగా బర్తరఫ్ చేయబడిన కొండా సురేఖ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ కొండా సురేఖ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆమె ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేక వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొండ క్యాడర్ కొండా కపుల్ నిర్ణయం ఏమీ తెలియక గందరగోళంలో ఉన్నారు.
క్యాడర్లో సురేఖ పొలిటికల్ ఫ్యూచర్ పైన ఆందోళన కొనసాగుతున్న వేళ కొండా సురేఖ దంపతులు మౌనం వహించారు. ప్రస్తుతం కొండా కపుల్ అజ్ఞాతంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు ముగిసే వరకు కొండా దంపతులు అజ్ఞాతంలో ఉంటారు. ఇది చాలాకాలంగా కొండా ఫ్యామిలీకి ఉన్న ఆనవాయితీ. వినాయక చవితి నవరాత్రులను తమకు సంబంధించిన ఏ పనులు చేయటానికి, ఎవరితోనూ మాట్లాడటానికి కొండా దంపతులు ఆసక్తి చూపించరు.

వీరికి ప్రతీ సంవత్సరం ఇదొక సెంటిమెంట్. దీంతో ప్రస్తుతం ఆమె పొలిటికల్ గా ముందుకు వెళ్ళే ఎలాంటి ప్లాన్ పై దృష్టి పెట్టటం లేదు. ఎవరితోనూ చర్చలు జరపటం లేదు. సైలెంట్ గా అజ్ఞాతంలో ఉండిపోయారు. మంత్రి పదవి నుండి బర్తరఫ్ తర్వాత రీసెంట్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కొండా సురేఖ ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళారు.
దీంతో వరంగల్ తూర్పులో, జిల్లాలో కొండా వర్గం ఆందోళనలో ఉంది. ఆమె పొలిటికల్ ఫ్యూచర్ కు సంబంధించి ఏం చేయబోతున్నారు అన్న చర్చ సాగుతుంది. కొండా దంపతులు ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పట్లో తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. వినాయక నవరాత్రులు ముగిసే దాకా అజ్ఞాతంలో ఉండే ఈ కపుల్ వినాయక నవరాత్రుల తర్వాతే తమ రాజకీయ ప్రస్తానంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే వరంగల్ తూర్పులో చాలా మంది కాంగ్రెస్ నాయకులతో టచ్ లోకి వెళ్తున్న బస్వరాజు సారయ్య కొండా వర్గాన్ని తమతో పాటు కాంగ్రెస్ కోసం కలిసి సాగాలని ఆహ్వానిస్తున్నారు. మంత్రి గానే కాదు రాజకీయంగా కొండా సురేఖ పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిందని చెప్తున్నారు. దీంతో కొందరు సారయ్య పంచన చేరుతుంటే, మరికొందరు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక గందరగోళంలో ఉన్నారు.













Click it and Unblock the Notifications
