కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం!
మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నారా సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి ఆయన నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఆయన అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించి వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన రాత్రి 40 నిద్రమాత్రలు వేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, కొండా సురేఖ ఓఎస్డీగా పని చేసిన సుమంత్ పైన గత కొంతకాలంగా ఉన్న వివాదాలు, ఆయనపై కేసులు నమోదు కావటం వంటి ఘటనల కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరరావు మనస్తాపానికి గురయ్యారని, గత కొంతకాలంగా తీవ్ర ఆందోళనలో ఉన్నారని కుటుంబసభ్యులు చెప్పారు. అయితే అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సుబ్రహ్మణ్యేశ్వరరావు కొడుకు సుమంత్ అనేక వివాదాలలో చిక్కుకోవటం, అతనిపై హత్యా యత్నం , బెదిరింపు ఆరోపణలు రావటం, కేసులు నమోదు కావటం వంటి అంశాలతో కొడుకు భవిష్యత్ ఏం అవుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళనతోనే ఆయన ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర రావు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేశారు. ఉద్యోగ విరమణకు మరో ఆరు నెలల సమయం ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
అనంతరం కుటుంబంతో కలిసి ఉంటూ కొంతకాలంగా మానసిక ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పైన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో హరికృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఐరన్ రాడ్లు, కర్రలతో దాడి చేసి, రూ.10 కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలతో హత్యాయత్నం, దోపిడీ కేసులు నమోదయ్యాయి.
దీంతో అప్పటి నుండి అజ్ఞాతంలో ఉన్న సుమంత్ కు నాంపల్లి కోర్టు నుండి ముందస్తు బెయిల్ లభించింది. దీంతో ఆయన నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో స్వయంగా విచారణకు హాజరయ్యారు. విచారణకు సహకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ అనుచరులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.













Click it and Unblock the Notifications
