ఆ 105మందికీ డౌటే! ఒక్క మాటంటే జగన్ వెంటే ఉండేవాళ్లం: కొండా సురేఖ, ‘సిగ్గులేని ఎర్రబెల్లి’

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వారిని బలి చేస్తున్నారని ఆ పార్టీపై వరంగల్ తూర్ప తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో కొండా మురళితోపాటు ఆమె మీడియాతో మాట్లాడారు.

మరోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే.. టికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. మంత్రి పదవి ఇవ్వకుంటే ఊరుకోరనే ఇలా చేశారని, ఇది మంచిది కాదని కొండా సురేఖ అన్నారు.

నిబంద్ధతో పనిచేశాం

నిబంద్ధతో పనిచేశాం

తాము టీఆర్ఎస్ పార్టీలో నిబద్ధతగా పనిచేశామని, అసెంబ్లీలో మాజీ మంత్రి అరుణ కలిసినా మాట్లాడలేకపోయామని చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకే సందర్భంలో గవర్నర్ వద్ద కలిశాం తప్ప మరెప్పుడూ కలవలేదని చెప్పారు. పార్టీ హైకమాండ్‌కు చెప్పకుండా ఏమీ చేయలేదని అన్నారు. 24గంటల్లో సమాధానం చెప్పకపోతే తమ నిర్ణయం ప్రకటిస్తామని కొండా సురేఖ చెప్పారు.

ఆ 105మందికీ నమ్మకం లేదు..

ఆ 105మందికీ నమ్మకం లేదు..

105మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి తన పేరును ప్రకటించని కారణంగానే తాము మీడియా ముందుకు వచ్చామని కొండా సురేఖ తెలిపారు. అయితే, 105మందికి బీఫాం ఇస్తారా? ఇవ్వరా? అనేది కూడా నమ్మకం లేదని అన్నారు. ఈ 105లో ఎన్నికల సమయానికి సగం మందిని తొలగించినా ఆశ్చర్యం లేదని అన్నారు.

సిగ్గులేకుండా ఎర్రబెల్లి..

సిగ్గులేకుండా ఎర్రబెల్లి..

తాము టీడీపీలోకి వస్తామంటే తమ కోట అని మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. సిగ్గులేకుండా ఇప్పుడు తామున్న టీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చారని కొండా సురేఖ మండిపడ్డారు.

జగన్ ఆ ఒక్క మాటంటే..

జగన్ ఆ ఒక్క మాటంటే..


కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేయడంతోనే వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళ్లామని చెప్పారు. ఒక వేళ జగన్ ప్రో తెలంగాణ అంటే ఓడిపోయినా ఆయన వెంటే ఉండేవాళ్లమని కొండా సురేఖ చెప్పారు. టీఆర్ఎస్ వాళ్లే పిలిచి టికెట్ ఇస్తే పోటీ చేశామని చెప్పారు.

తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబ కాదు.. ముందస్తు సరికాదు

తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబ కాదు.. ముందస్తు సరికాదు

తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం కాదని కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ ముందస్తు నిర్ణయం సరైందని కాదని అన్నారు. కొండా మురళీ మాట్లాడుతూ.. మధుసూదనా చారి కోరితే తామే ఆయన కోసం గత ఎన్నికల్లో భూపాలపల్లిలో ప్రచారం చేశామని చెప్పారు. తాము పార్టీ మారితే అందరికీ చెప్పే మారతామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+