ప్రచారంలో ఆమె స్టైలే వేరు.. బీఆర్ఎస్ ఆఫీసుకెళ్ళి కాంగ్రెస్ కు ఓటెయ్యమన్న కొండా సురేఖ!!

ఆమె ఒక మాస్ లీడర్. తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్న లీడర్. ఆమె ఏమి మాట్లాడినా, ఎవరిపైనైనా ధిక్కార స్వరం వినిపించినా రాష్ట్రంలో సంచలనంగానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో చారిత్రక నగరమైన వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కొండా సురేఖ ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న కొండాసురేఖ ఓటర్ల మద్దతు తనకు దక్కేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో సహజంగా ఒక అభ్యర్థికి మరో అభ్యర్థి తారసపడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఎన్నికల ప్రచారాన్ని సాగించే క్రమంలో ప్రత్యర్థి పార్టీల కార్యాలయాల వైపు కానీ, ప్రత్యర్థుల ఇళ్ళ వైపు కానీ చాలామంది అభ్యర్థులు వెళ్ళరు. కానీ కొండా సురేఖ వంటి కొందరు నేతలు మాత్రం ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు తారసపడితే కూడా తనకే ఓటేయమని కచ్చితంగా అడుగుతారు. అటువంటి సందర్భమే వరంగల్ నగరంలో చోటుచేసుకుంది.

 Konda Surekha went to BRS party office and asked to vote for Congress!!

వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ప్రచారంలో భాగంగా వరంగల్ నగరంలోని పెరుక వాడ బొడ్రాయి వద్ద ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఏకంగా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లిన కొండా సురేఖ అక్కడ ఉన్న వారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా ప్రతి ఒక్కరిని ఓటు అడగడం తన కర్తవ్యమని, ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎదురుపడినా కచ్చితంగా తనకి ఓటేయమని అడిగి తీరుతానని కొండ సురేఖ చెప్తున్నారు. ఒకవైపు ప్రత్యర్థి పార్టీల నాయకులను కూడాతనకు ఓటేసి గెలిపించమని అడుగుతూనే కొండా సురేఖ, మరోవైపు భారీగా చేరికలపై దృష్టి సారించారు.

ఇప్పటికే పలువురు కార్పోరేటర్ లను కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకునేలా చేసిన కొండ సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు. మరోపక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్పు కావాలి సురేఖ గెలవాలి అని కొండా మురళి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీలో చేరికలకు ఆయన చక్రం తిప్పుతున్నారు. వరంగల్ తూర్పు లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+