కొండా సురేఖకు కేఏ పాల్ డెడ్‌లైన్: రేవంత్ పనేనంటూ సంచలనం
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ప్రముఖ సినీనటులు సమంత, నాగార్జున, నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మంత్రి సురేఖపై మండిపడ్డారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అమెరికాలో అయితే మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తారన్నారు కేఏ పాల్. కొండా సురేఖ వ్యాఖ్యలు మతిభ్రమించి, పిచ్చి కుక్క కరిస్తే మాట్లాడినట్లు ఉన్నాయంటూ తీవ్రంగా స్పందించారు. ఆమె మాటలు చట్టవిరుద్ధమన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్య చేస్తే ఆయన పార్లమెంట్ సభ్యత్వమే పోగొట్టుకోవాల్సి వచ్చిందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పోలిస్తే.. కొండా సురేఖ వ్యాఖ్యలు 100 రెట్లు అభ్యంతరకంగా ఉన్నాయని కేఏ పాల్ పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖకు నోటీసులిచ్చి.. డీజీపీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు క్షమాపణలు చెప్తే.. హత్య చేసి సారీ చెప్పినట్లు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమంతకు ఎంత మనోవేదన, ఆవేదన ఉంటాయో ఊహించారా? అని ప్రశ్నించారు.
కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. 72 గంటల సమయం ఇస్తున్నాన్నారు. సురేఖను తొలగిస్తూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కొండా సురేఖ.. సమంత ఇంటికి, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి గర్వం ఎక్కవై నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని.. కళ్లు నెత్తిమీద ఉన్నాయని దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిక మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే కొండా సురేఖను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు కేఏ పాల్. సమంత మీద అనరాని మాటలు అని.. ఏం మాట్లాడానో తెలియదంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. 72 గంటల్లోగా కొండా సురేఖ రాజీనామా చేయాలి.. లేదంటే తాను లీగల్ గా ప్రొసీడవుతానంటూ హెచ్చరించారు. కొండా సురేఖపై కేసు నమోదు చేయాలన్నారు. హైడ్రా విషయంలో వ్యతిరేకత పెరుగుతోందని.. ప్రజల దృష్టి మరల్చేందుకే కొండా సురేఖతో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయించారేమోనని కేఏ పాల్ సందేహం వ్యక్తం చేశారు.
మరోవైపు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అదానీని ఎందుకు కలిశారంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. ఆ సమావేశంలో సునీల్ కనుగోలు ఎందుకు ఉన్నాడని నిలదీశారు. ప్రజలకు బుద్ధి లేదని.. రూ. 5వేలు తీసుకుని ఓట్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఓటర్లు ఆలోచనతో ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని సూచించారు.
కాంగ్రెస్ వద్దంటే మళ్లీ కేసీఆర్, కేటీఆర్ అని జనం అంటున్నారని కేఏ పాల్ చెప్పారు. మళ్లీ వాళ్లను ఎందుకు తీసుకురావాలి? వాళ్లంతా ఒకటేనని అన్నారు. పేద బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే.. ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. లేదంటే ప్రజలే నష్టపోతారన్నారు. 60 శాతం ఉన్న బీసీ ప్రజలకు తాను ఉన్నానని.. ఇక తనతో క్రిస్టియన్ మైనార్టీలు కూడా ఉన్నారని తెలిపారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications