నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కాదు: వదిలిపెట్టని కొండా సుస్మిత

కాంగ్రెస్ పార్టీలో కొండా సుస్మిత వ్యాఖ్యల దుమారం చిలికి చిలికి గాలివానగా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తన ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయని, తన తండ్రి కొండా మురళికి ఇంతవరకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని, కనీసం కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొండా సుస్మిత వ్యాఖ్యలపై స్పష్టత

అసలు రెండేళ్ల ముందే పరకాల సీటును అనౌన్స్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కుటుంబం చేసిన అవినీతిని బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని కొండా సురేఖ సమాధానమిచ్చింది. ఈ క్రమంలో కొండా సుస్మిత కూడా తాను చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు.

Konda Susmitha says her criticism was only against CM Revanth Reddy and his brothers over corruption

తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదన్న సుస్మిత

"నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కాదు" అని ఆమె స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన సోదరులను విమర్శించానని తెలిపారు.రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకు గౌరవం ఉందని సుస్మిత అన్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు విపరీతమైన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి ఆయనెవరు?

అందుకే తాను ఆయన్ను టార్గెట్ చేశానని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి ఆయనకు ఎలాంటి అధికారం ఉందని ప్రశ్నించారు.పరకాల స్థానం నుంచి తాను పోటీ చేస్తానని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమని సుస్మిత స్పష్టం చేశారు. నిన్న రాత్రి ఆమె మరోసారి వివరణ ఇస్తూ, తాను చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖకు ఎలాంటి సంబంధం లేదని, అవి పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయాలని తెలిపారు.

ఆగస్టు 23వ తేదీన హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి

ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ అంశం పైన సీరియస్ గా ఉన్న రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన అమెరికా పర్యటనను కూడా రద్దు చేసుకొని ఆగస్టు 23వ తేదీన హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తోంది.

టీజీఎస్ఆర్టీసీ తీపికబురు..ఉప్పల్‌లో కొత్త బస్ టెర్మినల్ తో పాటు మరో రెండు డిపోలు!
టీజీఎస్ఆర్టీసీ తీపికబురు..ఉప్పల్‌లో కొత్త బస్ టెర్మినల్ తో పాటు మరో రెండు డిపోలు!

సుస్మిత వ్యాఖ్యలపై తీవ్ర నిర్ణయం తీసుకునే ఛాన్స్

కొండా సుస్మిత వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి, కొందరు మంత్రులతో మాట్లాడిన సీఎం తిరిగి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే సుస్మిత వ్యక్తిగతంగా మాట్లాడినప్పటికీ, ఈ వివాదం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+